Minister Nimmala Ramanaidu -Dr. Jai : యూబ్లడ్ ఫౌండర్ డా. జై, జగదీష్ బాబు యలమంచిలి గారు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీని, మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందించేందుకు ఈరోజు బయలు దేరి ఏపీ సెక్రటేరియట్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆంధ్రాకు వచ్చిన డా.జై గారు అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. డా.జై గారితోపాటు జైస్వరాజ్య టీవీ బృందం సభ్యులు కూడా మంత్రి నిమ్మల గారిని కలిసి అభినందనలు తెలియజేశారు.
ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని.. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని జైస్వరాజ్య టీవీ, జైఎస్.డబ్ల్యూ టీవీ తరుఫున డా. జై గారు హామీనిచ్చారు. ఈ సందర్భంగా నిమ్మలతో మనసు విప్పి మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో కీలక మైన జలవనరుల శాఖ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.
మంత్రి నిమ్మలను కలిసిన వారిలో ‘డా.జై’ గారితోపాటు జై స్వరాజ్య టీవీ-జైఎస్.డబ్ల్యూ టీవీ ‘సీఓఓ నవీన్’ గారు, జైస్వరాజ్య టీవీ-జైఎస్.డబ్ల్యూ టీవీ డిజిటల్ హెడ్ ‘రాకేష్ గారు’ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.