IT Serve Synergy : లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్.. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రనూయిని కలిసిన డాక్టర్ జైగారు
IT Serve Synergy : అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రారంభం అయింది. ఈ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏపీలో పెట్టుబడులకు గల అనుకూల అంశాలను ఈ సమ్మిట్ వేదికగా… ఈ సమ్మిట్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ వివరించారు. ఈ సమ్మిట్ ప్రాంగణంలో పలువురు పారిశ్రామిక వేత్తలను సైతం మంత్రి లోకేష్ కలిశారు.
అలాగే ఈ సమావేశానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సిఈఓ క్లారా షియాలతో సైతం మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను లోకేశ్ కోరారు. అలాగే ఈ సమ్మిట్ లో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ హాజరైన పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రనూయి సూకీని ఆప్యాయంగా కలిశారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు. తర్వాత తనతో ఫోటోలు దిగారు.