JAISW News Telugu

Rahul Gandhi On UBlood : యూబ్లడ్ సేవలకు రాహుల్ గాంధీ ఫిదా.. డా.జై గారిపై ప్రశంసల వర్షం

Rahul Gandhi  : అమెరికా పర్యటనలో వివిధ వర్గాల వారిని కలుస్తున్నారు ఏఐసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పలురంగాల్లో ప్రముఖులు, సేవ చేస్తున్న వారు, విద్యార్థులతో మమేకం అవుతున్నారు..రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో భాగంగా ఈనెల 8వ తేదీన డాల్లస్, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. నేషనల్ ప్రెస్ క్లబ్ లో పాల్గొని ప్రసంగించారు.

సెప్టెంబర్ 9న వర్జీనియాలో రాహుల్ గాంధీకి ఇండియన్ ఓవర్సీస్ అమెరికా ప్రెసిడెంట్ ప్రదీప్ శ్యామల గారు ఎక్స్ క్లూజివ్ డిన్నర్ ను ఏర్పాటు చేశారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా ఈ పర్యటన వివరాలను పంచుకున్నారు. ‘‘ రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి 32 దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు, అంతర్జాతీయులు, అనేక మంది ప్రజల నుంచి అభ్యర్థనలు అందుకున్నారు. మీడియాతో పాటు చాలామంది ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు” అని పిట్రోడో ఒక వీడియోలో ప్రకటించాడు.

తాజాగా అమెరికాలోని టెక్సాస్ ‘ఇర్వింగ్’లో రాహుల్ గాంధీ పర్యటించారు.అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రవాస భారతీయులతో మమేక మయ్యారు. ప్రముఖ యూబ్లడ్ యాప్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు  రాహుల్ గాంధీని శాలువతో సత్కరించి యూబ్లడ్ డైరీని అందజేశారు. ఈ సందర్భంగా యూబ్లడ్ గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా డా.జై గారిని.. ఆయన చేస్తున్నసేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా.జై గారితోపాటు వారి తండ్రి గారు కృష్ణమూర్తి యలమంచిలి గారు రాహుల్ ను సన్మానించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తో పలు కీలకమైన అంశాలు చర్చించి తన నైతిక మద్దతును డా.జై గారు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. 

ఇంతకుముందు రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీ లో పర్యటించారు. ఆ సమావేశానికి హాజరైన యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు నైతిక మద్దతు తెలిసి నోబల్ కాజ్ కోసం తాను రాహుల్ గాంధీ అండగా ఉంటానని డా.జై గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ , ఆయన కంపెనీ సీఈవో పద్మజ , కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ లతో డా. జై గారు సమావేశమయ్యారు.

అనంతరం రాహుల్ గాంధీతోపాటు ఈ సమావేశానికి హాజరైన  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోనూ డా.జై గారు వాషింగ్టన్ డీసీ విల్లార్డ్ హోటల్ ఎదుట కలుసుకున్నారు. వర్తమాన రాజకీయాలు, యూబ్లడ్ యాప్ ద్వారా డా.జై గారు చేస్తున్న సేవలను తెలుసుకొని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు కొనియాడారు.


ఇక ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ ప్రెసిడెంట్ మోహిందర్ సింగ్ , సామ్ పిట్రోడా, టర్బన్, ప్రదీప్ శ్యామల తోనూ డా.జై గారు సమావేశమయ్యారు. డా.జై గారి వెంట వారి తండ్రి గారు కృష్ణమూర్తి యలమంచిలి గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు యూబ్లడ్ డైరీలను డా.జై గారు, వారి తండ్రి కృష్ణమూర్తి యలమంచిలి గారు అందజేశారు. యూబ్లడ్ సేవలను వివరించారు. సమాజానికి ఇంత చేస్తున్న డా.జై గారి సేవలను నేతలు అందరూ కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.

Rahul Gandhi and Dr. Jai Garu.. Galley : 

Exit mobile version