NSE ఇండియా సీఈవోను సన్మానించిన డా. జగదీష్ బాబు యలమంచిలి గారు
DR Jai : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ కు వచ్చిన NSE ఇండియా సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ (Ashishkumar Chauhan) ను యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీష్ బాబు యలమంచిలి గారు సాధారంగా ఆహ్వానించారు. ఎడిసన్ లోని JSW & జైస్వరాజ్య టీవీ వరల్డ్ టీవీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు యూబ్లడ్ డైరీని బహూకరించారు.
ఈ సందర్భంగా డా. జై గారు యూబ్లడ్ ద్వారా అందిస్తున్న సేవలను NSE ఇండియా సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గారు అడిగి తెలుసుకున్నారు. రక్తదానం ప్రాముఖ్యతను డా.జై గారు వివరించారు. యూబ్లడ్ యాప్ ద్వారా ఎంతో మందికి రక్తం అందిస్తున్న డా.జై గారు ఇంకా మరెన్నో కార్యక్రమాలను చేయాలని.. ఆయనసేవలను అభినందించారు.
భారత్-అమెరికా సంబంధాలు.. అమెరికాలోని ప్రవాస భారతీయుల సమస్యలు, పారిశ్రామిక విషయాలపై డా.జై గారు, NSE ఇండియా సీఈవో గారు చర్చించారు.