FISANA 22nd Anniversary : యూబ్లడ్ యాప్ ద్వారా ఎంతో మందికి రక్తం అందించేలా చేస్తూ.. అమెరికాలోని తెలుగువారు చేస్తున్న కార్యక్రమాలకు ఎంతో సేవ చేస్తూ.. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సమాజ సేవలో నేనున్నానంటూ సేవ చేస్తోన్న యూబ్లడ్ యాప్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారిని FISANA ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో నిర్వహించిన FISANA 22వ వార్షికోత్సవం -దీపావళి సెలబ్రేషన్స్ లో ఒక అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ జై గారి సేవలను కొనియాడారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండో-అమెరికన్ సీనియర్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(FISANA) ఆధ్వర్యంలో అవార్డును అందజేసి సత్కరించారు. జై గారు సమాజ సేవ చేస్తున్నతీరును నిర్వాహకులు కొనియాడారు.
జై యలమంచిలి గారు ఎంతో మంది వ్యక్తులు, మొత్తం కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద కార్యక్రమాలలో అనేక సహకారాలు అందిస్తున్నారు. ఆయన నమ్మకమైన సేవకు గుర్తింపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో FISANA అధ్యక్షుడు భరత్ రాణా, చైర్మన్ దీపక్ షా, కార్య నిర్వాహక కమిటీ పాల్గొంది.