Jr NTR : టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు విలువ లేదా?

Junior NTR

Junior NTRs role in TDP party

Jr NTR : టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై అనుమానాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అగాధం మరింత దూరం పోతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత పార్టీ కోసం పనిచేయలేదు. అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వైరం పెరిగినట్లు తెలుస్తోంది.

టీడీపీ రా కదలిరా అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో బాబు వేదిక మీదే ఉన్నా కనీసం వారించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నా చంద్రబాబు స్పందించకపోవడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శలు చేశారు.

సభకు ఎన్టీఆర్ అభిమానులు ప్లకార్డులు పట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులు, బ్యానర్లు చూపించొద్దని వారించారు. అయినా వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు కలకలం కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్, టీడీపీ కార్యకర్తల మధ్య గలాటా జరగడంతో అక్కడ పరిస్థితి తారుమారైంది.

ఈనేపథ్యంలో టీడీపీ, ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగే అవకాశముంది. ఎన్టీఆర్ అభిమానులను దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం అంత సులభం కాదని తెలిసినా టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగడం గమనార్హం. సభ జరుగుతున్న సమయంలో రెండు వర్గాలుగా మారి బాహాబాహీకి దిగడం అందరిని ఆశ్చర్యపరచింది. దీని ప్రభావం రాబోయే ఎన్నికల మీద  పడే అవకాశముంటుందని పలువురు అంటున్నారు.

TAGS