JAISW News Telugu

KKR Vs RCB : డబుల్ బోనాంజ సండే స్పెషల్.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రసవత్తర పోరు 

KKR Vs RCB

KKR Vs RCB

KKR Vs RCB : ఐపీఎల్ సీజన్ లో ఆదివారం మరో డబుల్ బోనాంజ మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ మైదానంలో లోకల్ టీం కోల్ కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమే ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సన్ రైజర్స్ మీద 287 పరుగులు సమర్పించుకున్నాక ఆర్సీబీ ఆడుతున్న మ్యాచ్ ఇది. ఆర్సీబీ ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి ఒక్క విజయంతోనే సరిపెట్టుకుంది. 

ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం. దినేశ్ కార్తీక్ ఫుల్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. సన్ రైజర్స్ పై కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. విరాట్ కొహ్లి తన ఫామ్ ను కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్ విభాగం కోలుకుంటే కోల్ కతా పై మెరుగైన ప్రదర్శన ఆశించొచ్చు. 

కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్స్ లో నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది. అన్ని జట్ల కంటే మెరుగైన రన్ రేట్  తో ఉంది. కోల్ కతాలో సునీల్ నరైన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో రాణిస్తున్నాడు. బౌలింగ్ లో హర్షిత్ రాణా, సునీల్ నరైన్ రాణిస్తుండగా.. బ్యాటింగ్ లో రస్సెల్ ఫామ్ లోకి రావాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పటి వరకు ఆశించినంతగా ఆడలేదు. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో నైనా తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. 

ఆర్సీబీ ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టోర్నీలో ప్లే ఆప్స్ అవకాశాలు మిణుకుమిణుకు మంటూ ఉంటాయి. లేకపోతే టోర్నీ నుంచి వైదొలిగిన మొదటి టీం ఇదే అవుతుంది. ఐపీఎల్ పురుషుల మ్యాచ్ ల కంటే ముందు మహిళ ఎడిషన్ జరగ్గా ఆర్సీబీ మహిళలే ఐపీఎల్ టైటిల్ గెలిచారు. దీంతో ఆర్సీబీపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ అభిమానులను నిరాశకు గురి చేస్తూ ఏడు మ్యాచుల్లో ఆర్సీబీ ఆరు ఓడిపోయింది.

Exit mobile version