Shanti Swarup : దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు..

Shanti Swarup

Shanti Swarup (File)

Shanti Swarup : దూరదర్శన్ అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది ‘శాంతి స్వరూప్’ అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వారికి దూరదర్శన్ అంటే శాంతి స్వరూప్.. శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్ అనుకునేవారు. 80’s జనరేషన్ కు శాంతి స్వరూప్ కు అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. దూరదర్శన్ లో ఆయన వార్తలు, సీరియల్స్ లో ఆయన నటన చూసిన వారంతా 80 జనరేషన్ వారే.

తెలుగు దూరదర్శన్ లో తొలి వాయిస్ అయిన శాంతి స్వరూప్ శుక్రవారం (ఏప్రిల్ 05) ఉదయం నగరంలోని యశోద హాస్పిటల్ లో మరణించారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో  కుటుంబ సభ్యులు హస్పిటల్ లో చేర్పించగా శుక్రవారం కన్ను మూశారు.

‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌టీ రామారావు ప్రారంభించారు’ అంటూ వార్తను చదువుతూ ఆయన కెరీర్ ప్రారంభించారు. ఈయన చదివిన బులెటిన్ దూరదర్శన్ లో 1983, నవంబర్ 14న రాత్రి 7 గంటలకు ప్రసారమైంది.

టెలిప్రాంప్టర్ లేనప్పుడు, అతను వార్తలను గుర్తుంచుకొని చదివేవాడు. ‘నేను గణితంలోని పట్టికలను గుర్తుంచుకున్నట్లు వార్తలను గుర్తుంచుకుంటాను. నాకు టెలీ ప్రాంప్టింగ్ అవసరం అయ్యేది కాదు’ అని ఆయన ఇప్పటి తరం న్యూస్ రీడర్స్ కు చాలా సార్లు సూచనలు చేస్తూ ఉండేవారు.

1965లో కృష్ణ తీసిన ‘తేరే మనసులు’ చిత్రంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు ఆయన. ఇక ఆయన సతీమణి రోజారాణి దూరదర్శన్ లో యాంకర్ గా పనిచేశారు.

శాంతి స్వరూప్ మరణవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నివాళులర్పించారు. తొలి తరం న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. 1983 నుంచి శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గా తనదైన ముద్ర వేశారు.

సుధీర్ఘకాలంగా దూరదర్శన్ అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. అతను 2011లో పదవీ విరమణ చేసే వరకు దూరదర్శన్‌లో పనిచేశాడు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. శాంతి స్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

TAGS