Renudesai : ‘మీకు ప్రేమ లేదా’..  ఇది నేను ఊహించలేదు.. రేణుదేశాయ్..డిసప్పాయింట్

Renudesai : బద్రితో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది రేణు దేశాయ్. తొలి సినిమాతో నే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో జత కట్టింది. తొలి సినిమా సూపర్ హిట్టైన ఆ తర్వాత పెద్దగా సినిమాలు ఒప్పుకోలేదు.  కానీ తరువాత పవన్ కల్యాన్ స్వీయ డైరెక్షన్  చేసిన జానీ సినిమాలో  మళ్లీ హీరోయిన్ గా చేసింది రేణు దేశాయ్.  ఆ తర్వాత కొన్ని రోజులకు పవన్ కల్యాన్ తో సహ జీవనం చేసిన రేణు దేశాయ్ కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు, కూతురు పుట్టారు.  ఆ తర్వాత పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ కు విడాకులు ఇవ్వడంతో పిల్లలతో కలిసి విడిగా ఉంటున్నది.

జానీ తర్వాత రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. కాగా ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తు ఉంటారు. తన పిల్లల గురించి, అలాగే సమాజంలో జరిగే సంఘటనలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. అలాగే తన పై నెగెటివ్ గా కామెంట్స్ చేసే వారికి కూడా ఘాటుగానే రిప్లై ఇస్తూ ఉంటారు. ఎంతో మంది ట్రోల్ చేసినా, వెకిలిగా కామెంట్ చేసిన దైర్యం కోల్పోరు. వారికి అదే తరహాలో బుద్దోచేలా సమాధానం చెబుతూ ఉంటారు.

రేణు దేశాయ్ పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆమె ఓ పెట్ కు ఆపరేషన్ కోసం పోస్ట్ షేర్ చేశారు. ఓ పెట్‌ డాగ్ కు ఆపరేషన్ చేయించాలని, దయచేసి సాయం చేయండి అంటూ విన్నవించారు. పెట్ డాగ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పోస్ట్ షేర్ చేశారు. అయితే ఆమె పోస్ట్ పై స్పందించించిన వారిలో చాలా మంది విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. దీని పై డిసప్పాయింట్ అయ్యారు.

నా ఇన్ స్టాకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నా, కానీ కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జంతువుల పై ప్రేమ ఉన్నవారు ఎక్కువ మంది స్పందిస్తారని భావించానని, కానీ ఇది తాను ఊహించలేకపోయానని వాపోయారు. రేణుదేశాయ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. జంతుప్రేమికులు పై స్పందించి విరాళాలు ఇవ్వాలని సోషల్ మీడియా యూజర్లు కోరుతున్నారు.
TAGS