JAISW News Telugu

Prashant Kishore : టైం వేస్టు చేసుకోవద్దు: ప్రజలకు ప్రశాంత్ కిశోర్ సలహా

Prashant Kishore

Prashant Kishore

Prashant Kishore : అనవసర రాజకీయ చర్యలు వింటూ సమయం వృథా చేసుకోవద్దని ప్రశాంత్ కిశోర్ ప్రజలకు సలహా ఇచ్చారు. నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలుబడిన తర్వాత ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో తొలిసారి స్పందించారు. ‘‘ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు.. రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావుల పనికిమాలిన చర్చలు, విశ్లేషణలపై మీ సమయం వృథా చేసుకోవద్దు’’  అని పీకే సలహా ఇచ్చారు.

ఈ సార్వత్రిక ఎనక్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు సాధిస్తుందదని ప్రశాంత్ కిశోర్ మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ, కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులను సవాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో ఉన్న వారికి ఒక సలహా ఇచ్చారు. ‘‘జూన్ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి’’ అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అక్కడ ఎన్డీయే కూటమి భారీగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోనూ బీజేపీ సీట్లు, ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు.

Exit mobile version