JAISW News Telugu

Betel Leaf : తమలపాకును లైట్ తీసుకోకండి.. ఆ సమస్యలకు ఇది బ్రహ్మాస్త్రంగా పని చేస్తుంది..

Betel Leaf

Betel Leaf

Betel Leaf : భారత సంస్కృతిలో భోజనం తర్వాత పాన్ (చిలుక) వేసుకోవడం అలవాటుగా ఉండేది. రాను రాను అది పూర్తిగా కనిపించడం లేదనుకోండి. ఈ అలవాటు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే పాన్ అంటే కేవలం తమలపాకు, వక్క, కాస్తంత సున్నం మాత్రమే ఉండాలి. ఎలాంటి పొగాకు ఉత్పత్తులు ఉండద్దు. ఇలా తేలికపాటి పాన్ వలన చాలా సమస్యలు తీరుతాయని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకు నీరు..
3 నుంచి 4 తమలపాకులను చక్కగా కడుక్కోవాలి. మూడు గ్లాసుల నీటిలో బాగా మరిగించాలి. అది బాగా మరిగి ఒక్క గ్లాస్ కాగానే చల్లార్చాలి. దీనిని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి. ఇది శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

మధుమేహం నియంత్రణ
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోని శరీరంలో చెక్కెర స్థాయిని నియంత్రించడంలో తమలపాకు బాగా సాయం చేస్తుంది. కాబట్టి మధుమేహ బాధితులు ఈ నీటిని తప్పనిసరిగా తాగాలి. మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. తమలపాకు నీటిని తాగడం వల్ల పేగులు క్లీన్ అవుతాయి. దీంతో మలబద్ధకం సమస్య మొత్తం పోతుంది.

కఫం పిత్త దోషాల నివారణ
తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఈ నీటిని తాగితే దగ్గు, పిత్త దోషాలు తొలగిపోతాయి. గొంతు వాపును తగ్గించడం, ఛాతిలో పేరుకుపోయిన కఫలం తొలగించడంలో సాయం చేస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..
వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలుంటే కూడా తమలపాకు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీరు జీర్ణశక్తిని పెంచడంలో సాయం చేస్తుంది. ఇంకా జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చెడు శ్వాసను దూరం చేస్తుంది..
తమలపాకు నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. దీంతో పాటు దంతాలను పాలిష్ చేయడంలో సాయపడుతుంది.

Exit mobile version