Sleep Tips : నిద్రపోయే ముందు బెడ్ పక్కన ఈ వస్తువులు ఉండద్దు.. ఉంటే ఏమవుతుందో తెలుసా?
Sleep Tips : ఆకలిని తట్టుకోవచ్చు కానీ నిద్రను తట్టుకోలేం. నిద్ర లేకుంటే శరీరం బాగా క్షీణిస్తుంది. సరైన నిద్ర లేకుంటే అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. నిద్ర ఉంటే శరీరంలోని గుండె తప్ప పూర్తి అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఆరోగ్య సూత్రాల్లో్ నిద్రకు పెద్ద పాత్ర కల్పించారు ఆరోగ్య నిపుణులు. మన జీవితాన్ని ఆరోగ్యకరంగా గడపాలంటే ఆహారపు అలవాట్లతో పాటు సరిపోయేంత నిద్ర కూడా అవసరం.
ప్రశాంతంగా నిద్రపోవాలంటే పడుకునే స్థలం కూడా ఇంపార్టెంట్ కొన్ని మన పక్కన ఉంటే నిద్ర పట్టదు. అది మంచిది కూడా కాదు. వీటిని పొరపాటున కూడా బెడ్రూమ్ లలో ఉంచుకోవద్దని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ వస్తువులు ఏంటో అవి పడుకునే స్థలంలో ఉండడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.
ఈ మధ్య ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం ఫ్యాషన్ గా మారింది. అలాంటి చెప్పులను నిద్ర పోయే ముందు బెడ్ వద్ద వదలిపెడతాం.. అలా వదలకూడదు.అలా చేయడం వల్ల ఇంట్లో చికాకు కలుగుతుందని వాస్తు పండితులు చెప్తున్నారు. ప్రశాంతంగా పడుకోవాలనుకుంటే చెప్పులను బెడ్ కు దూరంగా నిలపాలి.
స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడకం మొదలైనప్పటి నుంచి అది చూస్తూ పడుకోవడం అలవాటుగా మారింది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. సెల్ పక్కన ఉంటే నిద్ర పట్టదు. చిన్న శబ్ధం వచ్చినా మెలకువ వస్తుంది. కాబట్టి ఫోన్ ను దూరంగా పెట్టి నిద్రపోవాలి.
నిద్రించే ప్రదేశంలో వార్తా పత్రికలు కానీ పుస్తకాలు కానీ ఉంచుకోకూడదని కొందరు అంటారు. ఇలా నిద్రపోయే చోట పుస్తకాలు పెడితే సరస్వతీ దేవిని అవమానించినట్లే అని పెద్దలు చెప్తుంటారు.
కాబట్టి సుఖమైన జీవితం, ఆరోగ్యకరమైన శరీరం కావాలనుకుంటే మంచి నిద్ర అవసరం. అందుకని పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి ప్రశాంతమైన మంచి జీవనశైలిని అలవర్చుకోండి.