Allu Arjun : మూలాలు మరిచిపోవద్దు.. అల్లు అర్జున్ పై వరుణ్ తేజ్ దారుణ కామెంట్స్

Allu Arjun

Allu Arjun and Varun Tej

Allu Arjun Va Varun Tej : టాలీవుడ్ ఇండస్ట్రీలో బంధువులైన రెండు కుటుంబాల మధ్య హీట్ పెరుగుతూనే ఉంది. ఒక కుటుంబానికి చెందిన నటుల గురించి, మరో కుటుంబానికి చెందిన నటులు మాట్లాడడం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ విభజన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ వైసీపీకి చెందిన తన ఫ్రెండ్ తరుఫున ప్రచారం చేయగా.. జనసేన నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి ఒకే బంధుత్వం ఉన్న రెండు కుటుంబాలు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయని స్పష్టంగా కనిపించింది.

ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోలు, వారి అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి ఏ కామెంట్ వచ్చినా సోషల్ మీడియా వెంటనే అల్లు అర్జున్ కు లింక్ చేస్తుంది.  వరుణ్ తేజ్ మట్కా వచ్చే వారం విడుదల కానుండగా రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి తనకు ఎంత ఆసక్తి ఉందో చెప్పాడు.

వరుణ్ తేజ్ తన స్పీచ్ లో బన్నీ గురించి కానీ, పుష్ప 2 గురించి కానీ ప్రస్తావించకపోయినా అల్లు అర్జున్ కు కౌంటర్ గా ఈ కామెంట్ కనిపించింది. అలాగే అల్లు అర్జున్ అయినా, మరెవరైనా సరే ఇతర హీరోలపై పరోక్షంగా విమర్శలు చేసే వ్యక్తి వరుణ్ కాదు. ఇప్పటి వరకు ఆయన ఏ హీరోపై కూడా విమర్శలు చేయలేదు.

TAGS