Life Partner : రిలేషన్ అనేది ముఖ్యంగా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇందులో లవ్ రిలేషన్ (ప్రేమ సంబంధం) చాలా విలువైనది ఇది, కొద్ది మంది అదృష్టవంతులనే వివాహం వరకు తీసుకెళ్తుంది. ఇందులో కూడా ఎదుటివారి భావోద్వేగాలు, గౌరవం, నమ్మకం కాపాడడం, జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. భాగస్వామి మనస్సు గాయపరిచే మాటలు మాట్లాడద్దు. సాధారణంగా ప్రేమికులు లేదంటే భాగస్వాములు ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు ఇది తెలిసిందే. అయితే, రిలేషన్‌షిప్ లో ఏదైనా దాచేందుకు ప్రయత్నించవచ్చు.. కానీ ప్రతి బంధానికి ఒక పరిమితి ఉంటుంది. ప్రతీ వ్యక్తికి కొంత పర్సనల్ స్పెస్ ఉంటుంది. దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. దీని కోసం భాగస్వామిని మనం ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు అడగకూడదో తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే రిలేషన్ షిప్ దీర్ఘకాలం కొనసాగుతుంది. లేకపోతే సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. పొరపాటున కూడా భాగస్వామిని అడగకూడని ప్రశ్నలేంటో తెలుసుకుందాం.
కాల్ వివరాలు అడగవద్దు..
రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో మీ భాగస్వామి మీతో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ కొన్ని సార్లు అవసరాలను బట్టి ఇతరులతో కూడా మాట్లాడవలసి రావచ్చు. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఫోన్ బిజీగా ఉంటే అనవసరంగా అనుమానం పెట్టుకోవద్దు. చాలా మంది కాల్ వివరాలు చెప్పాలని, చెప్పినా స్క్రీన్‌షాట్ ఇవ్వాలని కోరతారు. ఇది చాలా తప్పు. ఇది మీ భాగస్వామిని చికాకుకు గురి చేయవచ్చు.
స్నేహితుల వివరాలు అడగద్దు..
ఎవ్వరికైనా ఫ్రెండ్స్ ఉండడం కామన్. భాగస్వామికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే వివాహం తర్వాత ఆ వ్యక్తి వారితో గడిపే సమయం చాలా తక్కువని చాలా మంది భావిస్తారు. ఇలాంటి సమయంలో మీ భాగస్వామి స్నేహితుల జాబితా అడగకూడదు. ఎక్కువగా అడగడం వల్ల సంబంధంలో చీలిక వస్తుంది.
పాస్ వర్డ్ అడగద్దు..
రిలేషన్‌షిప్‌లో ఉంటూ తమ వద్ద దాపరికాలు లేవంటూ బ్యాంక్ ఖాతా, ఫేస్‌బుక్, ఇన్ స్టా లేదా మొబైల్ పాస్‌వర్డ్‌ను పంచుకుంటారు. కానీ, అడగగానే చెప్తే ఒకే.. కానీ చెప్పాలని బలవంతం చేయవద్దు. ఎంత భాగస్వామి అయినా ఈ విషయంలో కొంత అసహనానికి గురికావచ్చు.
గతం గురించి అడగవద్దు..
మీ భాగస్వామికి గతంలో ఎఫైర్ లేదా బంధం ఉండే అవకాశం ఉంది. గతంలో ఒక వేళ ఉంటే వారు వాటిని మరిచిపోయి ముందుకు సాగాలని కోరుకుంటారు. కానీ, మీరు వారి మాజీ గురించి పదే పదే అడిగితే వారిలో కలవరం పెరుగుతుంది. పాత విషయాలను, గాయాలను చెప్పమనడం ఎవ్వరికైనా మంచిది కాదు.