Vijayanthi : శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాల విరాళం

Vijayanthi Mala
Gold Vijayanthi Mala : శ్రీవారికి టీటీడీ మాజీ ఛైర్మన్, దివంగత డీకే ఆదికేశవులనాయుడు మనవరాలు తేజస్వీ భారీ విరాళం అందించారు. సుమారు రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీమాలను తేజస్వీ విరాళంగా అందజేయనున్నారు.
టీటీడీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం తర్వాత రెండో అత్యంత ధనిక ఆలయంగా తిరుమలకు పేరుంది. తిరుమల రోజూవారి హుండీ ఆదాయమే కోట్లలో ఉంటుంది.