Donald Trump యునైటెడ్ స్టేట్స్‌లో జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సీటెల్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి తాత్కాలికంగా రద్దు చేశారు. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోగ్‌నూర్ తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన నిషేధ ఉత్తర్వును రద్దు చేస్తూ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు ప్రాథమిక నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పాలసీ అమలును 14 రోజుల పాటు నిలిపివేసింది.
ట్రంప్ అధికారంలోకి మొదటి రోజున జన్మత అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం రద్దు చేసే దస్త్రంపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులో తల్లిదండ్రులు ఇద్దరూ పౌరులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి కానట్లయితే అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని తిరస్కరించాలని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తూ ట్రంప్ రూల్ పాస్ చేశారు.. అయితే కోర్టు మాత్రం ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పు అమెరికా పౌరసత్వ చట్టాలను పునర్నిర్వచించటానికి ట్రంప్ నూతన ప్రయత్నానికి మొదటి పెద్ద చట్టపరమైన ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
‘రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వు ఉందని అందుకే రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. రిపబ్లికన్ మాజీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ నియమించిన న్యాయమూర్తి కొగ్హెనోర్ విచారణ సమయంలో కార్యనిర్వాహక ఉత్తర్వును “కఠినమైన రాజ్యాంగ విరుద్ధం”గా అభివర్ణించారు. న్యాయ శాఖ ఆదేశాన్ని సమర్థించడంపై జడ్జి స్పందిస్తూ న్యాయనిపుణులు ఎవరైనా ఈ ఉత్తర్వును రాజ్యాంగబద్ధంగా పరిగణించగలరని అవిశ్వాసం వ్యక్తం చేశారు.