Director Shankar : డైరెక్టర్ శంకర్ సినిమాల్లో హీరో మూడు గెటప్ లు వేయాల్సిందేనా.. వాటి ఫలితం ఎలా ఉందంటే ?
గతంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో విక్రమ్ రామ్, రెమో, అపరిచితుడు అనే మూడు పాత్రల్లో నటించారు. ఆ సమయంలో ఈ సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విక్రమ్ చేత మూడు గెటప్ లలో వేరియేషన్స్ అద్భుతంగా చూపించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే రోబో సినిమాలో రజనీకాంత్ చేత కూడా మూడు గెటప్స్ వేయించారు. రోబో సినిమాలో వశిష్ట, చిట్టి, విలన్ చిట్టి పాత్రల్లో నటింపజేశారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే.. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కేవలం పాటల కోసమే 90 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే న్యూస్ రీసెంట్‌గా వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకుగా విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. తండ్రి పాత్ర పవర్ ఫుల్ లీడర్ కాగా.. కొడుకు పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. అయితే.. ఈ రెండు క్యారెక్టర్ల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి పేరు అప్పన్న అని.. కొడుకు పేరు రామ్ నందన్ కుమార్ అని తెలుస్తోంది. సమాజంలో మార్పు కోసం పరితపించే నాయకుడి తరహాలో అప్పన్న క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తుండగ, ఈ జనరేషన్ కుర్రాడిగా, ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్ నందన్ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. దీంతో అప్పన్నగా, రామ్ నందన్‌గా చరణ్ అదరగొట్టడం ఖాయమంటున్నారు. దాంతో ఈ పేర్లు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయని అంటున్నారు. ఇక కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.