Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ కు అంత పొగరా.. ఏంటీ ఆ డైరెక్టర్ ను చులకన చేసి చూశాడా?
Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ అంటేనే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా మెప్పించడం వల్ల ఆయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. రాజేంద్ర ప్రసాద్ మూవీస్ అంటే మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కు చాలా ఇష్టమట. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనపుడు పీవీ రాజేంద్రప్రసాద్ మూవీస్ చూసేవాడంట. ఇది స్వయంగా పీవీ నరసింహారావు అన్నమాట.
డైరెక్టర్ రేలంగి నరసింహారావు తో రాజేంద్ర ప్రసాద్ దాదాపు 32 సినిమాలు చేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ తనతో ఇన్ని సినిమాలు చేసినా కొన్ని వందల ఇంటర్వ్యూ లలో పాల్గొన్న ఆయన మాత్రం తన పేరు ఎక్కడా చెప్పలేదని రేలంగి బాధపడ్డాడు. అంతే కాకుండా రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో తనను పిలిచి అవమానించాడని ఆయన ప్రొగ్రాం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయాడు.
అనంతరం రాజేంద్రప్రసాద్ పీఏ వచ్చి డైరెక్టర్ రేలంగి నరసింహరావు పేరు మరిచిపోలేదని కొన్నిటెక్నికల్ ఎర్రర్స్ తో మీ పేరు మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. దాదాపు ఆయన పీఏ తప్పు చేసిన వాడిలా కాళ్ల మీద పడటానికి కూడా ట్రై చేశాడు. అయితే దాన్ని నేను తప్పించుకున్నానని రేలంగి అన్నారు. రేలంగి నరసింహారావు రాజేంద్రప్రసాద్ తో భలే మొగుడు, చిన్నోడు పెద్దోడు,. భామకలాపం ఇలా ఎన్నో సినిమాలు తీశారు.
ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ తో ఎలాంటి గొడవలు లేవని కలిసిపోయామని ఆయన చెప్పారు. అయితే పది మందిలో గుర్తించకపోవడం.. చాటుగా పిలిచి మీరు గొప్పవారని ఎంత పొగిడినా లాభం లేదని చెప్పారు. అయినా సినీ ఇండస్ట్రీలో పని చేసేది ఒకటి డబ్బు కోసం, మరోటి గుర్తింపు. డబ్బు ఉన్నా లేకున్నా పర్లేదు కానీ గుర్తింపు లేకపోతే సినిమా ఫీల్డ్ లో రాణించలేమని వీరి సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. ఒక గొప్ప డైరెక్టర్, మంచి హిరో మధ్య ఇలాంటి ఇగో ఫీలింగ్స్ రావడం సహజమేనని అందరూ అనుకుంటున్నారు.