JAISW News Telugu

KKR Vs LSG : లక్నో పై  ఈ సారైనా కోల్ కతా నైట్ రైడర్స్ గట్టేక్కెనా..

KKR Vs LSG

KKR Vs LSG

KKR Vs LSG : ఐపీఎల్ ప్రేక్షకులకు డబుల్ దమాఖా లభించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కోలకతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరో హై హోల్టేజ్ మ్యాచ్ సాయంత్రం ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాయంత్రం 7.30కు వాంఖడే మైదానంలో ప్రారంభం కానుంది.

కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు మూడు సార్లు తలపడగా మూడింట్లో కూడా లక్నో నే గెలిచింది. దీంతో ఈ సారి లక్నో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. లక్నో ఇప్పటి వరకు అయిదు మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. లక్నో బ్యాటింగ్ బలంగా ఉన్నా ప్లేయర్లు అనుకున్న రీతిలో ఆడలేకపోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలం కావడంతో 167 పరుగులే చేసి ఓటమి పాలైంది. డికాక్, పూరన్, స్టోయినిస్, రాహుల్, దీపక్ హుడా లాంటి భారీ షాట్లు ఆడగల బ్యాటర్లు ఉన్నా వారు రాణించకపోవడం ఆ జట్టుకు భారంగా మారింది.

కోల్ కతా నైట్ రైడర్స్ కు గౌతం గంభీర్ మెంటర్ గా రావడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసమే పెరిగిపోయింది. సునీల్ నరైన్ ను ఓపెనింగ్ చేయించడంతో మునపటి ఫామ్ అందుకున్న సునీల్ బౌలర్లపై సిక్సులు, పోర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నారు. 25 కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ మాత్రం రాణించకపోవడం వారికి పెద్ద లోపంగా కనిపిస్తోంది. మిచెల్ స్టార్క్ మునుపటి ఫామ్ అందుకోవాలని టీం మేనేజ్ మెంట్ భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ లోకి వస్తే జట్టుకు తిరుగుండదు.

వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్ బ్యాటింగ్ లో ఇంకా మెరుపులు మెరిపించలేదు. కోల్ కతా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక దాంట్లోనే ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలవడం కోల్ కతా కు అవసరం. ఇప్పటి వరకు లక్నో తో తలపడిన మూడు సార్లు ఓడిపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. లక్నో పై గెలిచి  దెబ్బకు దెబ్బ తీయాలని కోల్ కతా నైట్ రైడర్స్ వ్యుహాలు రచిస్తోంది.

Exit mobile version