JAISW News Telugu

Chiranjeevi : అతడికి హీరో లక్షణాలు ఉన్నాయా.. నాకైతే కనిపించడం లేదు : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

 Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరో అవ్వడానికి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ అగ్రస్థానాన్ని సంపాదించి తనేంటో నిరూపించుకున్నాడు. తనతో పాటు డజన్ మందిని హీరోలుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నుంచి దాదాపు ఒక అరడజన్ మంది హీరోలు ఉన్నారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్, నిహారిక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు అయ్యారు.
 దీనికంతటికి కారణం మెగాస్టార్  తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని హీరోలుగా మార్చడంలో చిరంజీవిది ఎనలేని పాత్ర. చిరంజీవి తాను హీరోగా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ఆటుపోట్లనే ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో అన్ని కష్టాలను పడిన వ్యక్తి మరొకరు ఉండరంటే ఆశ్చర్యపడక మానదు. అప్పట్లో కష్టపడ్డాడు. ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాడు. చిరంజీవి సైతం హీరో అవుతానంటే ఎంతోమంది నువ్వు హీరో వా అని హేళన చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అయినా కూడా ఎక్కడ కూడా వెనుదిరిగకుండా ఆయన తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు తన తరం అయిపోయినా కూడా తన కొడుకులు తన చుట్టాల ఫ్రెండ్స్ కొడుకులు అందరూ చిరంజీవి పేరు చెప్పుకునే ఇండస్ట్రీలో ఏలుతున్నారు. అంత గొప్ప చిరంజీవి తన కూతురు భర్త హీరో అవుతానంటే మాత్రం హీరో లక్షణాలు అతనికి ఉన్నాయని అనేసాడంట. దీంతో అందరూ ఒక్కసారి షాక్ అయ్యారని తెలుస్తోంది.
 చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చిరంజీవి కళ్యాణ్ ని చూసి హీరో లక్షణాలు ఉన్నాయా ఈయనకు అని అన్నట్లు సమాచారం. చిరంజీవి అన్నట్లుగానే ఆయన చేసిన సినిమా అట్టర్ ప్లాప్ కాగా ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారు. దీంతో చిరంజీవి ముందే కళ్యాణ్ దేవి గురించి ఎక్స్పెక్ట్ చేసినట్లు అందరూ అనుకుంటున్నారు.
Exit mobile version