JAISW News Telugu

Gaami : అలాంటి సినిమాలకు ‘గామి’ ఆదర్శంగా నిలుస్తుందా!

Gaami

Gaami

Gaami : మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాను బతికించాలని సినీ అభిమానులు కోరుకుంటారు. తపన ఉన్న యువ దర్శకులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తలో చేయి వేయడం..పెట్టుబడి పెట్టడం.. ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. ఇలా క్రౌడ్ ఫండింగ్ తో తీసిని సినిమాలు కొన్ని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా లేవు.

కాగా, రీసెంట్ గా వచ్చిన ‘గామి’ మూవీ ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసింది. విద్యాధర్ కాగిత అనే కొత్త దర్శకుడు, యంగ్ హీరో విశ్వక్ సేన్ కెరీర్ లో తొలి వేస్తున్న సమయంలోనే మొదలుపెట్టిన సినిమా ఇది. చాందిని చౌదరీ హీరోయిన్. విద్యాధర్ విజన్ నచ్చి సోషల్ మీడియా క్యాంపెనింగ్ లో చాలా మంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే చిన్న సినిమా అయినా సరే రాజీ లేకుండా ఒక పెద్ద సినిమా రేంజ్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

ఆరేళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశాక యువీ క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ అండతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సినిమాను మంచి లాభాలకు అమ్మడమే కాదు బయ్యర్లందరినీ సేఫ్ జోన్ లోకి తీసుకురాగలిగింది మూవీ టీమ్. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసింది. గామిి వచ్చిన లాభాలను ఇప్పుడు చిన్న చిన్న పెట్టుబడిదారులకు పంచే ప్రయత్నంలో ఉంది గామి టీమ్. మొదటినుంచి సినిమా కోసం డబ్బులు ఇచ్చిన వాళ్లందరి లిస్ట్ తీసి వారికి లాభాలతో కలిపి ఇన్వెస్ట్ మెంట్ వెనక్కి ఇవ్వబోతున్నట్లు మెయిల్ పంపారు. త్వరలోనే సెటిల్ మెంట్ జరగబోతోంది. మున్మందు క్రౌడ్ ఫండింగ్ తో తీసే సినిమాలకు ‘గామి’ ఆదర్శంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

Exit mobile version