Chicken Causes Weight Gain : కొందరు తినడానికే బతుకుతారు. ఇంకొందరు బతకడానికి తింటారు. కొంత మంది కూరగాయలు తింటారు. మరికొందరు మాంసాహారం తింటారు. మాంసాహారం తినడం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుంది. దీంతో బరువు అధికంగా పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారికి మాంసాహారం అంత మంచిది కాదు. ఈ విషయ తెలిసినా ఎవరు పట్టించుకోరు. చూద్దాంలే అంటూ తేలికగా తీసుకుంటారు.
మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో మాంసం కంటే చికెన్ తినడం చాలా రకాలుగా మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చికెన్ ను కూడా అతిగా తినొద్దు. వారంలో కనీసం రెండు సార్లు వంద గ్రాముల చొప్పున తింటే ఎలాంటి నష్టం ఉండదు.
చికెన్ ను నూనెలో వేయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కారం, ఉప్పు, మసాలాలు వాడొద్దు. మాంసం కంటే చికెన్ తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మాంసం తినడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి. మాంసం తింటే బరువు పెరిగే ముప్పు పెరుగుతుంది. అందుకే చికెన్ తినడం వల్ల మేలు కలుగుతుంది.
మనం తినే ఆహారమే మనకు రక్షణగా నిలుస్తుంది. మన డైట్ సక్రమంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ విషయం గమనించుకుని మసలుకోవాలి. ఏది పడితే అది తిని కడుపు కీకారణ్యం చేసుకోవద్దు. సులభంగా జీర్ణమయ్యే వాటిని తీసుకుని మన ఆరోగ్యానికి ముప్పు లేకుండా ఉండేలా చూసుకోవాలి. చికెన్ తినడం వల్ల కొవ్వు తక్కువగా ఉండటం వల్ల నష్టమేమీ ఉండదు.