Beer : బీరు తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుందట..? తాజా అధ్యయనం ఏం చెబుతుందటే?
Beer : చిన్న పార్టీలు, గెట్ టు గెదర్, ఇంట్లో ఏ చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చే డ్రింక్ బీర్. బీరు తాగడం వల్ల లాభాలు ఉన్నాయని తరచూ వింటూనే వింటాం. దీనిపై చాలా వాదనలు ఉన్నాయి. కానీ, బీరు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది నిజమా? అన్నది ఇక్కడ తెలుసుకుందాం..
ఆల్కహాల్లో బీరు మాత్రమే ఎక్కువ వినియోగించబడేది. ఇది ఇతర విస్కీ, రమ్, స్కాచ్ తదితరవాటికంటే తక్కువ ఆల్కహాల్ ను కలిగి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. విటమిన్-బీ, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం.. పరిమిత పరిమాణంలో బీరు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుందని తేలింది.
బీర్లో 125 కేలరీలు ఉంటాయి. బీరు శరీరంలోని హెచ్డీఎల్ స్థాయిని పెంచుతుంది. ఇది సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరులో ఫోలిక్ యాసిడ్తో సహా బీ విటమిన్లు ఉంటాయి. ఇది గుండెపోటును నివారించడంలో సాయ పడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు బీరు ఎక్కువగా తాగితే ఇన్సులిన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది.
బీరు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిస్తే, క్యాన్సర్ ప్రమాదం తగ్గడం, మధుమేహం నియంత్రణ, మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడం నుంచి కొలెస్ట్రాల్, రక్తంలో గడ్డలు వంటివి తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ, బోలు ఎముకల వ్యాధి, ఎముకల ఆరోగ్యం, హైబీపీ తగ్గేందుకు సాయ పడుతుంది.
బీరులో హిమోగ్లోబిన్ పెంపు, రక్తహీనత తగ్గించే విటమిన్లు ఉంటాయి. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ఇది సాయపడుతుంది. బీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. బీరును ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.
బీరు అనేది మాల్టెడ్ బార్లీ, గోధుమలు లేదంటే మొక్కజొన్నతో తయారు చేస్తారు. ఇది బ్రూయింగ్ ప్రక్రియలో పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని లిక్విడ్ బ్రెడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని పానీయంగా కాకుండా ఆహారంగా పరిగణిస్తారు. బీరు వినియోగం ప్రతికూల ఆరోగ్య పరిణామాలను కలిగి ఉన్నప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల వాటిలో బ్లడ్ షుగర్ అసమతుల్యత, ఆల్కహాల్ డిపెండెన్స్, డిప్రెషన్, క్యాన్సర్ లేదంటే అకాల మరణం వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.