BRS Social Media : లోక్ సభ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ ఎంత క్లూ లెస్ గా ఉందో.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అలాగే దారి తప్పిపోయిందనే మాటలు వినపడుతున్నాయి. మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వారిలో జగడం పెట్టుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వంపై మాత్రం పోరాటం చేయలేకపోతున్నారు. టీడీపీ సోషల్ మీడియా సానుభూతి పరులతో వాదులాట పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారనే చెప్పుకోవాలి.
రీసెంట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడడానికి.. తప్పుల్ని ఎత్తిచూపడానికి కూడా భయపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే సహించే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ మంది భయపడుతున్నారు. దీంతో వారు ఖాళీగా ఉండలేక అవసరం లేని వాదనలకు సోషల్ మీడియాలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలా టీడీపీ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అతిగా స్పందించడంతో వారంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు. అలా పని చేయడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభమేమి ఉండకపోవచ్చు కానీ.. బీఆర్ఎస్ మ్యాన్ పవర్ మాత్రం పనికి రాని విషయాలపై డైవర్ట్ అయిపోయింది.
ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ముందు మీరు ప్రారంభించారంటే.. మీరు ప్రారంభించారనుకుని ఒకరిపై ఒకరు మార్ఫింగ్ లు వేసుకుని టైం పాస్ చేసుకుంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనంగా ఉన్నప్పటికీ… ఉన్న కొద్దీ అకౌంట్ల ద్వారానే బలమైన ముద్ర వేస్తోంది. అపన్నహస్తం లాంటి అకౌంట్ల కంటెంట్ డామినేట్ చేస్తుందనే చెప్పాలి.