JAISW News Telugu

Doctors to Actors : వీళ్లు డాక్టర్లు కాదు.. యాక్టర్లు.. నటీమణులుగా తెరపై తళుక్కులు.

Doctors to Actors

Doctors to Actors

Doctors to Actors : సినిమాల్లోకి వచ్చిన చాలా మంది తాము అనుకోకుండా యాక్టర్లు అయ్యామని, కానీ తాము డాక్టర్లు కావాలని ఇంట్లో వాళ్లు కోరుకున్నారని చెబుతుంటారు. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం డాక్టర్ కావాలని ఎంబీబీఎస్ చేసి, తమ ఇష్టాలు, అవకాశాలకు మేరకు సినీ ఇండస్ర్టీలో సెటిలైపోయారు. హీరోయిన్లుగా స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలా డాక్టర్ కాబోయి యాక్టర్లయిన వారి గురించి తెలుసుకుందా.

హీరోయిన్ సాయి పల్లవికి సౌత్ ఇండియాలో తిరుగులేని పాపులారిటీ ఉంది. తన ఎలాంటి రోల్ అయినా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తుంది. కానీ సాయి పల్లవి నిజ జీవితంలో వైద్య విద్యను అభ్యసించింది. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను పూర్తి చేసుకుంది. కానీ అప్పటికే  మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవికి సినిమాల్లో అవకాశాలతో పాటు సక్సెస్ లు కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి.

తన నటనతో  ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మోడలింగ్ నుంచి  ఫిలిం ఇండస్ర్టీలోకి వచ్చింది. ఐశ్వర్య కూడా  సౌత్‌లో హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇక ఐశ్వర్య కూడా డాక్టరే.  శ్రీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
శ్రీలీల.. మొన్నటి దాకా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కేవలం ఒకే ఒక్క సినిమాతో దాదాపు నాలుగేళ్ల పాటు ఈ బ్యూటీ డైరీ ఖాళీ లేదంటే ఆమె ఏ రేంజ్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ చిత్రంతో సాండల్ వుడ్ కు పరిచమైన శ్రీలల తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీలీల తల్లి బెంగళూర్ లో ఫేసమ్ గైనకాలజిస్ట్. తాను కూడా తల్లి లాగే డాక్టర్ అవ్వాలనుకుంది.  అందుకు తగ్గట్లే ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. సినిమాల్లో అవకాశాలతో డాక్టర్ వృత్తికి దూరమైంది.

2017లో  మిస్ వరల్డ్ టైటిల్‌ విజేత మానుషి చిల్లర్. ఆ మోడలింగ్ తో కెరీర్  ప్రారంభించిన మానుషి సినిమాల్లోకి వచ్చి అభిమానులను ఆకట్టుకుంది. మానుషి చిల్లర్ సోనిపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించింది.  అందాల పోటీల్లో పాల్గొనడానికి తన చదువుకు కొంత విరామం తీసుకుంది. మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లో నటిస్తున్నది.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్. పలు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది అదితి. అదితి కూడా రామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకుంది. తండ్రిని చూసి సినిమాల్లో వచ్చింది.

టాలీవుడ్ హీరోయిన్ రూపది ఆంధప్రదేశ్ లోని విజయవాడ. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.  సినిమాల్లోకి రాకముందే ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది.

Exit mobile version