JAISW News Telugu

sneeze : ఉదయం లేవగానే తుమ్ములు వస్తున్నాయా అయితే కారణం ఏంటో తెలుసా?

sneeze

sneeze

sneeze in Morning : ఉదయం నిద్ర లేవగానే ఎక్కువగా తుమ్ములు వస్తుంటే మీరు ఒక వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. చాలామందికి చలికాలం రాగానే ఆస్తమా, తుమ్ములు రావడం, కళ్ళలోంచి నీరు కారడం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడగా మారిపోవడం ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఉదయం లేవగానే ఇలా తుమ్ములు రావడానికి అలర్జీ రినేటిస్ అని అంటారు.  అలర్జీ  కారణంగా ఉదయం లేవగానే చాలామందికి తుమ్ములు కంటిన్యూగా వస్తూ ఉంటాయి.

అయితే వీరి శ్వాస కోశాల్లోకి దుమ్ము కణాలు చేరి ఇలా తుమ్ములు రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే చాలామందికి డస్ట్ ఎలర్జీ పెంపుడు జంతువుల చుండ్రు జుట్టు రాలడం ఇతర దుమ్ము కణాలు లాంటివి నోరు ముక్కులోకి వెళ్లడం ద్వారా  సాధారణంగా తుమ్ములు వస్తుంటాయి. అయితే కంటిన్యూగా ఇలా రావడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామందికి అలర్జీ రినేటిస్ అనే వ్యాధి వల్ల కంటిన్యూగా తుమ్ములు రావడంతో పాటు కళ్ళు ఎర్రబడడం, మంట పెట్టడం ముక్కు కూడా మంట పుడుతుంది. దీంతోపాటు కళ్ళలోంచి ఎక్కువగా నీళ్లు కారుతూ ఉంటాయి. ముక్కులోంచి కూడా నీరు కారుతుంది. ముక్కు దురదగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడు ఎక్కువగా తుమ్ములు రావడంతో బయట తిరగడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే దుమ్ము ముక్కులోకి వెళ్లకుండా చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం దుమ్ము కణాలు ముక్కులోకి నోరులోకి వెళ్లడం ద్వారానే ఎక్కువగా శ్వాసకోస ఇబ్బందులు తలెత్తి ఇలా తుమ్ములు వస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా ముక్కుకు బట్ట లాంటివి కట్టుకోవడం  ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుమ్ములు రాకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు. అయితే ఈ తుమ్ముల బాధ నుండి తప్పించుకోవడానికి అనేక రకాల ఆయుర్వేద మందులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version