Beautiful Star Alia Bhatt : ఈ క్రింది ఫోటో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?, శరీరాన్ని బాణం విల్లు వంచినట్టు వంచి ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది కదూ!..ఇది యోగాసనాలలో ముఖ్యమైన ఆసనం కపోతాసనం అట. ఈ ఆసనం రెగ్యులర్ గా వెయ్యడం వల్ల మన వెన్నుముక దృడంగా తయారు అవుతుందట. ఈ హీరోయిన్ కి ఇలాంటి వర్కౌట్స్ మరియు యోగాసనాలు చెయ్యడం అంటే చాలా ఇష్టం. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ ఇమేజి సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ తెలుగు లో కూడా ఒక సినిమా చేసింది.
బాలీవుడ్ లో ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి నేటి తరం హీరోయిన్స్ లో ది బెస్ట్ అనిపించుకున్న ఈమె రీసెంట్ గానే ఒక బాలీవుడ్ క్రేజీ హీరో ని పెళ్ళాడి ఒక బిడ్డకి జన్మని కూడా ఇచ్చేసింది. ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక్కడే మీ అందరికీ అర్థం అయిపోయి ఉండాలి, ఆమె అలియా భట్ అని.
అలియా భట్ కి యూత్ లో ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమెకి ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ ని ఒకసారి చూస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్షరాలా 82 మిలియన్ల ఫాలోయర్స్ ఆమెకి ఉన్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధి లోనే మిలియన్ల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. పెళ్లి అయ్యాక ఏ అమ్మాయికి అయినా శక్తి, అందం తగ్గుతుంది అంటారు. పైగా పిల్లల్ని కన్న తర్వాత శరీరం లో ఉన్న సామర్థ్యం మొత్తం తగ్గిపోతుంది అని అంటారు. కానీ అలియా భట్ మాత్రం ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహం తో ముందుకు పోతూ ఉంటుంది.
ఎప్పటి లాగానే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ , యోగాసనాలు వేస్తూ , దానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమె వేసే యోగాసనాలు చూస్తే అసలు ఈమె శరీరం లో ఎముకలు ఉన్నాయా అని అనుమానం రాక తప్పదు. మగవాళ్లకు సైతం ఇలాంటి ఆసనాలు అసాధ్యం అనే చెప్పాలి. ఇక ఆమె ప్రస్తుతం జిగ్ర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది కూడా. షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.