JAISW News Telugu

heroine : ఈ హీరోయిన్ గుర్తుందా..? ఆ సినిమాలో కంటే.. ఇప్పుడు చూస్తేనే ఆశ్చర్యపోవాలి..a

FacebookXLinkedinWhatsapp

heroine : వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మెల్ల మెల్లగా హీరోగా మారాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ సినిమా ముకుందలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మీ’లో లీడ్ రోల్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మంచి మంచి సినిమాలు చేశాడు. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఒకటి. 2020లో వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇది మలయాళంలో విజయం సాధించింది.

కేరాఫ్ కంచరపాలెంతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’కు దర్శకత్వం వహించాడు. ఇందులో సత్యదేవ్ నటన విమర్శకుల నుంచి కూడా శెహబాస్ అనిపించింది. కొవిడ్ సమయంలో రావడంతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇందులో చాలా మంది కొత్తవారు నటించారు. ఫొటో గ్రాఫర్ పాత్రలో నటించాడు సత్యదేవ్. ఇందులో హీరోయిన్ గా నటించిన నటి ఎవరో గుర్తుందా? ఆమె గురించే మనం మాట్లాడుకునేంది.

ఆమె పేరు ‘రూప కొడువాయూర్’ చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంటుంది. ఈమె పదాహారణాల తెలుగు అమ్మాయే. తెలుగులో 2 సినిమాల్లో నటించింది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్..’లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. అందమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో చూడండి.

Exit mobile version