Former Governor : ఈ పెద్ద మనిషిని గుర్తుపట్టారా? మన మాజీ గవర్నర్ నరసింహన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Former Governor : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ పూర్తిగా మారిపోయారు. ముసలి తనం రావడంతో గుర్తుపట్టలేనంతగా మారారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎక్కువ కాలం పనిచేసిన వారిలో ఆయనే అగ్రగణ్యులు. వివాదారహితుడుగా కొనసాగారు. దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ గా సేవలందించిన వ్యక్తిగా రికార్డు సాధించారు. గవర్నర్ నరసింహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉన్నారు.
2007 జనవరి 25న చత్తీస్ గడ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాలు ఆ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 27,2009న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ బాధ్యతలు తీసుకున్నారు. 9 సంవత్సరాల నాలుగు నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. మొత్తంగా 12 సంవత్సరాల పాటు గవర్నర్ పదవిలో కొనసాగడం విశేషం.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన సరోజిని నాయుడు కూతురు పద్మజా నాయుడు పది సంవత్సరాలు ఒకే చోట గవర్నర్ గా పనిచేసిన రికార్డు ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ 9 సంవత్సరాల 4 నెలలు బాధ్యతలు నిర్వహించారు. మరో ఏడాది పాటు పని చేస్తే ఆయన కూడా రికార్డు కొట్టేవారే.
ఇప్పుడు ముసలితనం రావడంతో గుర్తు పట్టలేనట్లుగా మారిపోయారు. శరీరమంతా ముడతలు పడిపోయాయి. దీంతో ఇప్పుడు చూస్తే ఎవరు కూడా గుర్తు పట్టరు. అలా మారిపోయారు. మన గవర్నర్ గా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు మాత్రం వయోభారం పెరిగి అప్పటి ఛాయలు కనిపించకుండా పోయాయి. ఆయనను ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతాం.