Star Heroine : ‘లింగ’లో సైడ్ రోల్ చేసిన ఈమెను గుర్తు పట్టారా? ఇప్పుడో స్టార్ హీరోయిన్..

Star Heroine
Star Heroine : సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడంటే చాలు కథ, కథనంతో పెద్దగా పని ఉండదు. స్టోరీ ఎలా ఉన్నా ఆయన క్యారెక్టరైజేషన్ తోనే సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టాల్సిందే. ఇటీవల రజనీకాంత్ చేసిన జైలర్ సినిమా బడ్జెట్ కు చాలా రేట్లు వసూలు చేసింది. రూ. 700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
రజనీకాంత్ కూతురు చేసిన లాల్ సలాం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇవన్నీ పక్కన ఉంచితే రజనీకాంత్ సినిమాలో కనీసం సైడ్ రోల్ వస్తే చాలు అనుకునే వారు అనేక మంది ఉంటారు. రజనీకాంత్ గతంలో నటించిన ఒక సినిమాలో సైడ్ రోల్ చేసిన ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ రీసెంట్ గా ఆమె చేసిన సినిమా మహేశ్ బాబు సీనిమాను దాటి కలెక్షన్లను కురిపించింది. దాని గురించి తెలుసుకుందాం.
View this post on Instagram
రజనీకాంత్ గతంలో చేసిన సినిమాల్లో 2014లో వచ్చిన ‘లింగ’ ఒకటి. కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. ఇందులో అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పక్కన లేడీ రోల్ లో నటించిన వారు గుర్తున్నారా? చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
ఆ బ్యూటీ ఎవరో కాదు.. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో హీరోయిన్. అదేనండీ.. ‘హను-మాన్’లో హీరోయిన్ గా నటించిన అమృత అయ్యర్. ఈ అమ్మడు రామ్ పోతినేని హీరోగా చేసిన రెడ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవలే హను-మాన్ తో సంచలన విజయాన్ని అందుకుంది. భారీ హిట్ అందుకోవడంతో పాటు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను నెలకొల్పింది. హను-మాన్ హిట్ తో అమృత అయ్యర్ కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
View this post on Instagram