JAISW News Telugu

Credit Cards : క్రెడిట్ కార్డుపై 16 అంకెలే ఎందుకు ఉంటాయో తెలుసా? ఏఏ నెంబర్ దేనిని సూచిస్తుందంటే?

Credit Cards

Credit Cards

Credit Cards : డిజిటల్ మనీతో ఆర్థిక మోసాలు జరగవని భావించిన మోడీ ప్రభుత్వం ఆ దివగా అడుగులు ముందుకు వేసింది. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి డిజిటల్ మనీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా యూపీఐ యాప్ లు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే ఇలా చాలా వాడకంలోకి వచ్చాయి. షాపింగ్, తదితర వినియోగం కోసం బ్యాంకులు పెద్ద ఎత్తున క్రెడిట్ కార్డులు ఇవ్వడం మొదలు పెట్టాయి.

గతంలో ఎక్కువ సాలరీ ఉన్న ఉద్యోగులకు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లకు మాత్రమే బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చేవి. కాని ఇప్పుడు సాధారణ వేతనం, చిన్న చిన్న వ్యాపారులకు కూడా కార్డులు జారీ చేస్తున్నారు. దీంతో ఒక్క వ్యక్తి అనేక బ్యాంకుల కార్డులను వినియోగిస్తున్నాడు. ఈ కామర్స్‌ సంస్థలు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వస్తువులపై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే క్రెడిట్ కార్డులపై కొన్ని వివరాలు అంటే అంకెలు, సీవీవీ, ఎక్స్ పయిరీ డేట్ లాంటివి ఇవి ఎందుకు ఉంటాయి.  

కార్డు నెంబరును గమనిస్తే 16 ఉంటాయి. ఏ బ్యాంకు కార్డును గమనించినా 16 నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఇంతకీ కార్డులపై 16 నెంబర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి? తెలుసుకుందాం..

ఈ నెంబర్లలో కార్డులోని మొదటి నెంబర్‌ సదరు కార్డును జారీ చేసిన సంస్థ గురించి చెబుతుంది. తొలి సంఖ్య 4 అయితే ఆ కార్డు వీసా జారీ చేసిందని అర్థం. అదే తొలి సంఖ్య 5 అయితే మాస్టర్‌ కార్డు జారీ చేసిందని అర్థం. ఇక తొలి సంఖ్య 6 అయితే సదరు క్రెడిట్ కార్డును రూపే జారీ చేసిందని అర్థం. తర్వాతి 6 నెంబర్లు సదరు కార్డును ఏ బ్యాంక్‌ జారీ చేసిందో చెబుతుంది. దీన్ని ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (IIN), లేదా బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (BIN) అని పిలుస్తారు.

7 నుంచి 15 సంఖ్యలు మీ కార్డుకు సంబంధించి అకౌంట్‌ తెలియజేస్తుంది. ఈ అకౌంట్‌ మీకు క్రెడిట్ కార్డ్‌ జారీ చేసిన బ్యాంక్‌ వద్ద ఉంటాయి. క్రెడిట్‌ కార్డులోని చివరి సంఖ్యను చెక్‌ డిజిట్‌గా పిలుస్తారు. నకిలీ క్రెడిట్ కార్డుల తయారీకి అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడుతుంది.

Exit mobile version