India Map : మూడో తరగతి నుంచి డిగ్రీలు, పీజీలు చేసే దాక అందరిలో ఒకటే డౌట్.. భారత దేశ మ్యాప్ లో శ్రీలంక ఎందుకు ఉంటుందోనని.. టీచర్లను అడిగితే వాళ్లెక్కడ తంతారో అని భయం. అసలు వాళ్లకు కూడా తెలుసో తెలియదో అనే సందేహం. ఇలా ఆ సందేహాన్ని ఇంకా చాలా మంది తమ బుర్రలో మోస్తూనే వస్తున్నారు. అలాంటి వారికి ఇక్కడ సమాధానం దొరకనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదవండి మరి..
భారత దేశం మ్యాప్ ను గమనిస్తే కన్నీటి బిందువులాగా.. నుదుటపెట్టిన బొట్టులాగా శ్రీలంక కనిపిస్తుంది. మన దేశం మ్యాప్ లో ఆ దేశాన్ని చూపెట్టడం ఎందుకనేగా మీ ప్రశ్న. సాధారణంగా ప్రతీ దేశానికి సరిహద్దులు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఆయా దేశాల మ్యాప్ లు రూపొందిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇలాగే తమ దేశపు భూగోళాన్ని మ్యాప్ లో పొందుపరుస్తునా్నరు. కానీ ఒక్క భారత్ మాత్రమే తమ భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంకను కూడా చూపిస్తోంది.
ఇలా ఒక దేశాన్ని మరో దేశం మ్యాప్ లో మనం ఎప్పుడూ చూడం. మన సరిహద్దు దేశాలైన పాక్, చైనా, బంగ్లాదేశ్ కూడా భారత్ మ్యాప్ లో కనిపించవు. కేవలం ఒక్క శ్రీలంక మాత్రమే కనిపిస్తుంది. అయితే దీనికి ఓ కారణముంది. అదెంటో తెలుసుకోండి..
ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ) 1958లో ఓ చట్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ‘లా ఆఫ్ ది సీ’ పేరుతో ఒక అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించారు. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాలను తప్పనిసరిగా చేసింది. ఏదైనా ఒక దేశం సముద్రతీరంలో లేదా ఆదేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధం కలిగి ఉంటే.. ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్ లో చూపించాలి.
రెండు దేశాల మధ్య 200 నాటికల్ మైల్స్ అంటే.. 370 కి.మీ. లోపు ఉన్న దేశాన్ని కచ్చితంగా తమ మ్యాప్ లో కూడా చూపించాలి. అలా చూసుకుంటే శ్రీలంక.. భారత్ నుంచి కేవలం 18 నాటికల్ మైల్స్ అంటే కేవలం 54.8 కి.మీ దూరం మాత్రమే ఉంది. అందుకే మన మ్యాప్ లో కచ్చితంగా శ్రీలంక కూడా ఉంటుంది.