Balakrishna : కన్న కొడుకు బాలకృష్ణ పెళ్లికి కూడా ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా..

Balakrishna

Balakrishna

Balakrishna : సీనియర్ ఎన్టీఆర్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిలో రాణించారు. నందమూరి తారక రామారావుకు కు మొత్తం 11 మంది సంతానం. అందులో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. ఎన్టీఆర్ తన సొంత మరదలు బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు. కానీ 11 మందిలో బాలకృష్ణ, హరికృష్ణ, పురందేశ్వరి, నారా భువనేశ్వరి మాత్రమే చాలా మందికి తెలుసు.

బాలకృష్ణ వసుంధర దేవిని 1982 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరు వివాహానికి రాలేదు. బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం అప్పటి ప్రజా యాత్ర అని తెలుస్తోంది. రామ కృష్ణ, బాల కృష్ణ ఇద్దరి పెళ్లిళ్లు ఒకే సారి జరగ్గా..  ఈ రెండు పెళ్లిళ్లకు తండ్రి ఎన్టీఆర్, అన్నహరికృష్ణ రాలేదు.

అయితే ప్రజా యాత్ర ద్వారా ప్రజలను దగ్గరి నుంచి కలుస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తిరుపతి లో జరగ్గా.. ఇద్దరు కొడుకులు తమ భార్యలను తీసుకుని ప్రజా యాత్ర వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ పట్టుదల, పనితనం గురించి అందరికీ అర్థమైపోయింది. అందరూ ఫిదా అయిపోయారు. ఈ మధ్య కాలంలో శత జయంతి ఉత్సవాల్లో సీనియర్ నటుడు నిర్మాత మాగంటి మురళీ మోహన్ ఈ విషయాన్ని బయట పెట్టాడు.

తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ ఎక్కువగా ప్రజల్లో గడిపేవాడు. కొడుకుల పెండ్లి ఉందని అటు వెళితే ప్రజాయాత్రకు ఇబ్బంది అవుతుందని సొంత కొడుకుల పెళ్లికి కూడా హాజరు కాలేదు. దీంతో ఆయనపై ప్రజల్లో విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. దీని వల్ల టీడీపీ పెట్టిన ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ నట సార్వభౌముడిగానే కాకుండా.. సీఎంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలతో మరింత గొప్పగా గుర్తింపు పొందాడు.

TAGS