Mount Everest : ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటెన్ అని తెలిసిన విషయమే. కాగా ఈ శిఖరం మరింత ఎత్తు పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. భూమి లోపల అంతర్గతంగా వస్తున్న మార్పుల వల్ల భూమి పొరల్లో లోపల ఉన్న నదుల వల్ల ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అసలు ఇలా ఒక శిఖరం ఎత్తు పెరగడం అనేది సాధ్యమేనా ఎంతవరకు నిజం అనే విషయాల గురించి లోతుగా పరిశీలన చేస్తున్నారు.
ఎవరెస్టు శిఖరం భూమి నుండి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిమాలయ పర్వతాలు 89 వేల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల నమ్మకం. హిమాలయ పర్వతాలు అత్యంత ఎత్తైన పర్వతమే ఎవరెస్ట్. ఇది నేపాల్ లో ఉంటుంది. కాంచన గంగ తదితర పర్వతాలు కూడా ఎవరెస్టు శిఖరాన్ని దాటి వెళ్లే దారిలో కనిపిస్తూ ఉంటాయి. భూమి లోపల ఉన్న యురేషియన్ టెక్నిక్ ప్లేట్స్ వల్ల ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఐ సో స్టాటిక్ రీబాౌండ్ పద్ధతి ద్వారా ఇలాంటి కదలికలు జరిగి ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరిగిందని పేర్కొంటున్నారు. చైనాలోని బీజింగ్ నగరంలో ఉన్న జియో సైన్స్ సెంటర్ వారు కూడా శిఖరం పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ జియో సైన్స్ ఫర్ టెక్నాలజీ అనే సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్ గా ధ్రువీకరించింది. లండన్ లో చదువుకుంటున్న స్మిత్ అనే విద్యార్థి ఎవరెస్ట్ లో ఎత్తు పెరగడానికి గల కారణాన్ని విశ్లేషించారు.
కింద ఉన్నటువంటి అరుణానది తోపాటు ఇతర నదులు కూడా కదలికలు పయనం మార్చుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని తెలిపాడు. ఇలా నదులు తమ స్థానాన్ని మార్చుకొని ప్రవహించడంతో ఎవరెస్ట్ కింద ఉన్న భాగం పై ఒత్తిడి తగ్గి ఇలా ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయని ఇది ఏటా ఎత్తు పెరుగుతూనే ఉంటుందని అన్నారు.
ఎవరెస్టుకు సమానంగా ఉన్నటువంటి మకాలు పర్వతం కూడా ఈ విధంగానే ఎత్తు పెరుగుతూనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఎవరెస్టు ఎత్తు పెరిగితే దాని పర్యవసనాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కానీ అది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదని చెబుతున్నారు.