JAISW News Telugu

Spin bowling : ఇండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఎందుకు ఆడలేకపోతున్నారో తెలుసా?

spin bowling

spin bowling

spin bowling : భారత క్రికెట్ జట్టు లో ఏదైనా స్పెషల్ ఉందంటే అది స్పిన్ బౌలింగ్ ను బాగా వేయడం, అదే ప్రత్యర్థి స్పిన్ బౌలర్లను చీల్చి చెండాడటం. కానీ కాలం  మారింది. రోజు రోజుకు భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను అస్సలు ఆడలేకపోతున్నారు. దీనికి ఉదాహరణే న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్. ఒకప్పుడు స్పిన్ పిచ్ లు తయారు చేసుకుని వాటిపై భారీగా పరుగులు చేసి ప్రత్యర్థి బ్యాటర్లను స్పిన్ బౌలింగ్ లో ఆలౌట్ చేసి టెస్టులు గెలిచేవారు. కానీ అదే ప్రత్యర్థి చేతిలో ఇంత దారుణంగా స్పిన్ కు దాసోసమై ఓడిపోతారని ఎవరూ కూడా కలలో అనుకోలేదు. పుణేలో జరిగిన టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా 13 వికెట్లు తీసి ఇండియా ఓటమికి కారణమయ్యాడు. మరో వైపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ స్పిన్ బౌలింగ్ లో ఆడలేకపోతున్నారు.

షేన్ వార్న్, ముత్తయ్య మురళీదరన్, గ్రేమ్ స్వాన్, సక్లెన్ ముస్తాక్ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లను ఈజీగా ఎదుర్కొన్న ఒకప్పటి బ్యాటర్లు స్పిన ఎలా ఆడాలో నేర్పించారు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి టాప్ రేంజ్ ఆటగాళ్లు కూడా స్పిన్ బౌలింగ్ లో చాలా బాగా రాణించేవారు. తద్వారా భారత్ టెస్టుల్లో విజయాలు సాధించేది. కానీ ప్రస్తుతం భారత టెస్టు బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ లో ఇబ్బందులు పడుతున్నారు.

2021 నుంచి విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ లో ఇప్పటికే 19 సార్లు అవుటయ్యారు. గిల్ 14 యశస్వి జైశ్వాల్ 8, రాహుల్ 7 సార్లు అవుటై తమ బలహీనతను చాటుకున్నారు. పూజారా, రహనే లాంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్లను కాదని నూతన జట్టును సెలెక్ట్ చేస్తే వీరు మాత్రం తమ బలహీనతతో టెస్టు క్రికెట్ లో టీ 20 మ్యాచ్ లు ఆడి వికెట్లను ఈజీగా ఇచ్చేస్తున్నారు. కాగా దీనికంతటికీ కారణం ఐపీఎల్, టీ 20 లు పెరిగి స్పిన్ లో డిఫెన్స్ ఆడలేకపోవడమే కారణమని అంటున్నారు

Exit mobile version