India Upper Hand on Australia : ఆస్ట్రేలియాపై భారత్ దే పై చేయి.. ఎందులో తెలుసా?

 

India Upper Hand on Australia

India Upper Hand on Australia

India Upper Hand on Australia : T-20 సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ లో ఈ రెండు జట్లు పాల్గొనగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇండియా టూర్ ఉంది. దీనిలో భాగంగా గురువారం (నవంబర్ 30) రోజున విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.

టీ 20కి సంబంధించి ఇటీవల జట్లను ప్రకటించారు. ఇందులో సీనియర్లను ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం కల్పించారు. రెండు జట్లలోనూ జూనియర్లు బ్యాట్ టు బాల్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇరు జట్లలో యువరక్తం తమను తాము ప్రూవ్ చేసుకోవాలి.. అలాగే వరల్డ్ కప్ ఫైనల్ పై పగ తీర్చుకోనున్న యువకులు.

ఇరు జట్ల రికార్డుల గురించి తెలుసుకుంటే..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 26 T-20 మ్యాచ్ లలో తలపడగా.. ఇందులో భారత్ 15 విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 10 గెలుపొందింది. ఒక మ్యాచ్ రద్దయింది. శాతంగా చూసుకుంటే టీమిండియా గెలుపు శాతం 57.67 కాగా.. కంగారుల గెలుపు శాతం 38.46. ఇక భారత్ స్వదేశీ గడ్డపై ఆస్ట్రేలియాతో 10 T-20 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో ఆరింటిలో భారత్ గెలిచింది. ఆస్ట్రేలియా నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది.

2007లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ T-20 జరిగింది. రెండు జట్ల మధ్య 10 సిరీస్ లు జరిగాయి. ఇందులో కూడా భారత్ దే పైచేయి. భారత్ 5, ఆస్ట్రేలియా 3 గెలుచుకుంది. 2 డ్రా అయ్యాయి. 2022, సెప్టెంబర్‌లో జరిగిన T-20లో ఇవే రెండు జట్లు పాల్గొన్నాయి. అక్కడ ఫలితం 2-1తో ఇండియాకే అనుకూలంగా ఉంది. వైజాక్ లోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 3 T-20 మ్యాచ్ లలో భారత్ 2 గెలిచింది. ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది.

జట్ల వివరాలు..

భారత తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (సి), ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా.

TAGS