Abhishek Sharma : అభిషేక్ శర్మ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా..
Abhishek Sharma : టీ 20 ప్రపంచ కప్ అనంతరం టీం ఇండియా జింబాబ్వే తో అయిదు టీ 20 ల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే కు వెళ్లగా యువ ఆటగాళ్లు మొదటి మ్యాచ్ లో ఓడి ఓటమి మూటగట్టుకున్నారు. యువ లెప్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో డకౌట్ కాగా.. రెండో మ్యాచ్ లో 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్ లో 8 సిక్సులు బాదడం విశేషం. మొదట 33 బంతులకు 50 పరుగులు చేసిన అభిషేక్ శర్మ తర్వాత 50 పరుగులు కేవలం 13 బంతుల్లోనే సాధించడం విశేషం. అయితే దీనికి ఒక కారణం ఉందని మ్యాచ్ అనంతరం తన సీక్రెట్ ను బయటపెట్టాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయిన అనంతరం రెండో మ్యాచ్ లో ఒత్తిడి ఉందని ఆ సమయంలో శుభ్ మన్ గిల్ ను తన బ్యాట్ ఇవ్వమని కోరారని తెలిపాడు. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ ఇద్దరూ అండర్ 12 నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్నారు. దీంతో వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.
అభిషేక్ శర్మ బ్యాట్ అడగ్గానే శుభ్ మన్ గిల్ ఇవ్వడంతోనే ఈ మ్యాచ్ లో సెంచరీ చేయగలిగానని అన్నారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మలు మంచి ఫ్రెండ్స్ కాగా.. టీం ఇండియాకు సెలెక్ట్ అయిన అన్న విషయం తెలియగానే ముందుగా కాల్ చేసి మాట్లాడింది .. విషెస్ చెప్పింది గిల్ అని చెప్పాడు.
యువరాజ్ పాజీ అంటే ఎంతో గౌరవం అని తనకు ఆయన ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నాడని పేర్కొన్నాడు. లాఫ్టెడ్ షాట్లు ఆడటం కోచ్ లకు ఇష్టం ఉండదు. కానీ తన తండ్రి ప్రోత్సహాంతో లాఫ్టెడ్ షాట్లు ఆడుతున్నానని అభిషేక్ శర్మ తెలిపాడు. ఈ షాట్లు ఆడినపుడు కొడితే బంతి మైదానం బయట ఉండాలని తన తండ్రి చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు.