JAISW News Telugu

Owaisi-Madhavi Latha : ఒవైసీ, మాధవీ లత ఓటు ఎవరికి వేస్తారో తెలుసా?

Owaisi-Madhavi Latha

Owaisi-Madhavi Latha

Owaisi-Madhavi Latha : రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా బాగా చర్యలో ఉన్న లోక్ సభ స్థానం ‘హైదరాబాద్’. ఇక్కడ ఎంఐఎం పార్టీ 40 ఏళ్లుగా పాతుకుపోయింది. దాదాపు 20 ఏళ్లకు పైగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు మరో నేత అధికార పరిధి పరిమితుల కారణంగా సొంత పార్టీలకు ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది.

రాజేంద్రనగర్ లో నివసిస్తున్న ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఓటు హక్కు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటరు జాబితాలో ఈస్ట్ మారేడ్‌పల్లి, మహేంద్రహిల్స్ లో నివసిస్తున్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలత పేరు వినిపిస్తుంది. ఫలితంగా ఒవైసీ, లత ఇద్దరూ తమ తమ పార్టీలకు ఓటు వేయలేని సందిగ్ధంలో పడ్డారు.

ఓవైసీ, మాధవీలతతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మహ్మద్ సమీర్, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వంటి వారు భౌగోళిక అసమానతల కారణంగా సొంత పార్టీలకు ఓటు వేసుకోలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు.

అయితే వీరు తమ ఓటును వారి పార్టీ అభ్యర్థులకు వేసినా తమకు మాత్రం వేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీరు ఈ రకంగా కూడా చాలా ఫేమస్ అవుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఒవైసీకి బలమైన పోటీ..

బీజేపీ తరుఫున మాధవీ లత రంగంలోకి దిగినప్పటి నుంచి బీజేపీకి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బలం పెరిగిందనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా మాధవీ లత చర్చల్లోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రంలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ స్థానం గురించి చర్చ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ఎంఐఎం కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Exit mobile version