JAISW News Telugu

First heroine : సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ను శాసించిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా?

First heroine

First heroine Rekha

First heroine : కెరీర్‌లో 200కి పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్  70వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా, బాలీవుడ్ స్టార్స్‌తో పాటు చాలా మంది అభిమానులు ఈ స్టార్ హీరోయిన్ క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ను శాసించి మొదటి హీరోయిన్ రేఖ. రేఖ తన ప్రతిభతో బాలీవుడ్‌ను కొన్నేళ్ల పాటు శాసించింది. మూడు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్న రేఖ.. బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరు. 1954లో అక్టోబర్ 10న తమిళ కుటుంబంలో జన్మించింది. రేఖ తల్లిదండ్రులు సుప్రసిద్ధ తమిళ నటులు జెమినీ గణేశన్, పుష్పవల్లి. తమిళంలో తండ్రి స్టార్ హీరో. రేఖ అసలు పేరు భాను రేఖ. సినిమాల్లో స్ర్కీన్ నేమ్ రేఖగా మార్చకుంది.

రేఖ కూడా తన తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ నటననే వృతకతిగా ఎంచుకుంది. 1966లో తొలిసారిగా ‘రంగుల రాట్నం’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. రేఖ తన సినీ ప్రయాణాన్ని సౌత్ సినిమా నుంచి ప్రారంభించింది. తన ప్రతిభతో  స్టార్ గా ఎదిగింది. ఆ తర్వాత రేఖ బాలీవుడ్‌ లో రాణించాలని తన మకాం ముంబైకి మార్చింది. 1970లో ‘సావన్ భదౌన్’ సినిమాతో హిందీ తెరకు పరిచమైంది. ఆ తర్వాత రేఖ వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 30 ఏళ్ల పాటు బాలీవుడ్ తెరపై నంబర్ వన్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఖూబ్‌సూరత్..

1980లో విడుదలైన ‘ఖూబ్‌సూరత్’ చిత్రానికి హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.  హృషికేష్ ముఖర్జీ ఆ సయయంలో పెద్ద డైరెక్టర్. ఖూబ్ సూరత్ చిత్రంలో రేఖ మంజు దయాళ్ పాత్రను పోషించింది. రేఖ ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసింది. ఆమె పాత్ర అజరామరంగా మారింది. రేఖకు పేరు తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రానికి గానూ రేఖకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

‘ఉమ్రావ్ జాన్’..

దర్శకుడు ముజఫర్ అలీ చిత్రం తీసిన చిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో ఈ సినిమా విడుదలైంది. రేఖ కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. ఈ చిత్రంలో అమిరాన్ పాత్రను రేఖ పోషించింది. ఈ సినిమానే రేఖకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చింది. రేఖ  ఈ చిత్రంలో నటించిన క్యారెక్టర్ తోనే కొన్నాళ్ల పాటు దేశ వ్యాప్తంగా నానింది. ఈ చిత్రంలో రేఖ ఖవ్వాలిపై డ్యాన్స్ చేసి ప్రశంసలు అందుకుంది. 40 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా పేర్లు, పాత్రలు ప్రజల నోట ఇప్పటికీ నానుతున్నాయి. ఈ చిత్రంలో రేఖ నటనకు జాతీయ ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కేలా చేసింది.

‘ఖూన్ భారీ మాంగ్’..

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ 1988లో ఖూన్ భారీ మాంగ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో రేఖ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో రేఖ పాత్ర పేరు ఆర్తి సక్సేనా. రేఖతో పాటు కబీర్ బేడీ, ఖాదర్ ఖాన్, ఏకే హంగల్, సోను వాలియా,  వికాస్ ఆనంద్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోసించారు. ఈ సినిమాలో రేఖ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తెర మీద స్టార్ గా వెలిగిపోయేందుకు ఈ క్యారెక్టర్ దోహదం చేసింది. ఈ చిత్రానికి గానూ రేఖకు  ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.

‘ఖిలాడియోన్ కే ఖిలాడీ’..

దర్శకుడు ఉమేష్ మెహ్రా చిత్రం ‘ఖిలాడియోం కే ఖిలాడీ’ 1996లో విడుదలైంది. ఈ చిత్రంలో రేఖతో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఇందులో రవీనా టాండన్, టికు తస్లానియా, అంజనా ముంతాజ్, దేవన్ వర్మ,  దినేష్ ఆనంద్ వంటి నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో కూడా రేఖ తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గానూ రేఖకు మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.

‘కోయి మిల్ గయా..

రేఖ తన కెరీర్‌లో ఎన్నో పాత్రల్లో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తొలిసారి నానమ్మ పాత్రలోనూ రేఖ అద్భుతంగా నటించింది. 2003లో వచ్చిన ‘కోయి మిల్ గయా’ సినిమాలో హృతిక్ రోషన్ నానమ్మగా రేఖ నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు గాను రేఖ ప్రశంసలు అందుకుంది. రేఖ కెరీర్‌లోనే ఈ క్యారెక్టర్‌ చాలా స్పెషల్‌.

Exit mobile version