అనుష్కను ఓ మాస్ హీరో స్థాయిలో ఎలివేట్ చేసి ఆకట్టుకున్నాడు క్రిష్.
క్రిష్ తన సినిమా కెరీర్ లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవితంలో మరోసారి కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. క్రిష్ త్వరలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకోబోతున్నారని తెలిసింది. డైరెక్టర్ క్రిష్‌కు ఇది రెండో వివాహం కాగా, డాక్టర్ ప్రీతి చల్లాకు కూడా రెండో వివాహమే. ప్రీతి ప్రముఖ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా పేరుపొందారు. చల్లా హాస్పిటల్స్‌లో డాక్టర్‌గా సేవలందిస్తున్నారు.
ప్రీతి కుటుంబంలో ఆమె ముందు మూడు తరాలు కూడా వైద్యులే. నాలుగో తరంలో ప్రీతి కూడా డాక్టర్ కావడం విశేషం. క్రిష్, ప్రీతిల వివాహం నవంబర్ 10న జరగనుంది. నవంబర్ 16న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. క్రిష్ గతంలో రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. కానీ 2018లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత క్రిష్ సింగిల్‌గా ఉన్నారు. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.