Pawan Kalyan : పవన కల్యాణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా..

Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాదు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. సినిమాలో హిరో స్థాయి నుంచి ఏపీలో ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. సినిమా రంగంలో, రాజకీయాల్లో రెండింటిలో రాణించినా పవన్ కల్యాణ్ చివరకు మూడు పెళ్లిళ్లు, విడాకుల గురించి ఎక్కువగా ట్రోల్స్ అవుతూనే ఉంటారు.
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలో చాలా విమర్శలకు గురయ్యాడు. పవన్ కు మొదటిది పెద్దలు కుదిర్చిన వివాహం, రెండోది ప్రేమ పెళ్లి కాగా.. మూడో వివాహం రష్యన్ అమ్మాయి అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు. కానీ పవన్ కు ఫస్ట్ లవ్ వీరందరి మీద లేదు.. కేవలం రివాల్వర్ మీదే ఫస్ట్ లవ్ ఉండేదని స్వయంగా ఆయనే ఒకానొక సందర్భంలో ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఫస్ట్ ఎఫైర్ అన్ని రివాల్వర్ తోనే చేసేవాడని గన్స్ పై ఇష్టంతో పవన్ కల్యాణ్ తీవ్రవాదుల్లో చేరుతాడా ఏంటీ అని మెగాస్టార్ చిరంజీవి భయపడినట్లు తెలుస్తోంది. ఈ భయంతోనే చిరంజీవి సొంతంగా రివాల్వర్ కొని పవన్ కల్యాణ్ కు గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.
రివాల్వర్ ను పవన్ కల్యాణ్ ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోయారంటా..ఎప్పుడూ జేబులోనే తుపాకీని ఉంచుకోవడమే కాకుండా.. నిద్రపోయే సమయంలో పక్కలోనే పెట్టుకునే వాడంటా.. అంతే కాదు ఉదయం లేవగానే రివాల్వర్ కు ఫస్ట్ కిస్ ఇచ్చే వాడని తెలుస్తోంది. అందుకే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కొనిచ్చిన గన్ అంటే చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం. ప్రస్తుతం పవన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఫుల్ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ను చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. విమర్శించిన నోర్లు మూతపడ్డాయని ఇక పవన్ హవా నడుస్తుందని చెప్పారు.