Behind Success of Pacers : మెన్స్ వరల్డ్ కప్ లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఎనిమిది విజయం సాధించింది టీమిండియా. ఓటమి ఎరుగని జట్టుగా టాప్ 1 పొజిషన్ లో ఉంది టీమిండియా. జట్టును విజయ తీరాలను తీసుకెళ్లేందుకు అందరూ కలిసి కట్టుగా ఆడుతున్నా.. ముఖ్యంగా బౌలర్ల గురించి కొంత ఎక్కువగానే చెప్పుకోవాలి. టోర్నీ ప్రారంభంలో ఫస్ట్ 5 మ్యాచ్ లకు ఛేజింగ్ చేస్తూ గెలిచింది. అయితే, వీటిలో ఏది కూడా భారత్ ముందు అంత భారీ స్కోర్ పెట్టలేదు. దీనికి కారణం ముఖ్యంగా బౌలర్లనే అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లను కూడా టీమిండియా మట్టి కరిపించింది. ఇక ఇంగ్లండ్ ను 129కి, శ్రీలంకను అత్యంత దారుణంగా 55కే ఆలౌట్ చేసింది. ఇక పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సౌతాఫ్రికాను సైతం 83 పరుగులకే కుప్ప కూల్చింది.
దీనికి కారణమైన పేస్ ఎటాక్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ పిచ్ లు ఎక్కువగా స్పిన్ కు అనుకూలిస్తాయి. ఇక, ఇండియా టీమ్ లో ముగ్గురు పేసర్లు ఉన్నారు. బూమ్రా, సిరాజ్, షమీ. ఈ ముగ్గురు పేస్ కు కొత్త అర్థం చెప్తున్నారు.ఇంత భారీ పేస్ అటాక్ ఇండియన్ టీములో చూడలేదని ప్రపంచ దిగ్గజ బ్యాట్స్ మన్స్ అంటున్నారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ ఉన్నా ఏక కాలంలో ముగ్గురు లేరని అంతా అనుకుంటున్నారు. ఇన్నాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ లో బలంగా ఉన్న టీమిండియా ఇప్పుడు బౌలింగ్ పరంగాకూడా బలంగా ఉంది. దీనికి కారణం ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ముగ్గురు న్యాచురల్ బౌలర్లను మరింత రాటు దేలేలా చేసింది బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. ఈ ముగ్గురికి వెనుక నుంచి శక్తి అందిస్తుంది మాంబ్రేనే. ఆయన బౌలింగ్ కోచ్ గా ఎన్నికైన తర్వాత వీరు ముగ్గురి బౌలింగ్ కు మరింత పదును పెట్టాడు. ఆశించినంత మంది ఆల్ రౌండర్లు లేకపోయినా.. ఎక్స్ ట్రా బ్యాటింగ్ లైన్ లేకపోయినా ఈ ముగ్గురు పేసర్లు ఉన్నారంటే జట్టు విజయం ఖాయమనే చెప్పాలి. వీరికి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు మాంబ్రే.
ముంబైకి చెందిన పరాస్ మాంబ్రే 1972, జూన్ 20న ముంబైలో పుట్టారు. బాల్యం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన తండ్రితో క్రికెట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. ఆయన కూడా అంగీకరించడంతో సచిన్ కు కోచ్ గా వ్యవహరించిన అజయ్ మంజ్రేకర్ వద్ద కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత దేశవాలీ మ్యాచ్ లలో ఆడాడు. ఆ సమయంలో అత్యుత్తమ బౌలర్ గా ఉన్నారు. తన కెరీర్ లో 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 284 వికెట్లు, 83 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడి 111 వికెట్లు తీశాడు. 1996, మే 23న ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు మాంబ్రే. కానీ కేవలం 3 వన్ డేలు, 2 టెస్ట్ లు మాత్రమే ఆడాడు. టెస్ట్ లలో 2, వన్ డేలలో 3 వికెట్లు మాత్రమే తీశాడు.
1996లో వరల్డ్ కప్ ఆడే అవకాశం ఆయనకు వచ్చింది కానీ, ఆయనతో పాటు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్, మనోజ్ ప్రభాకర్, సలీల్ అంకోలా ఈయనకంటే మంచి ప్రదర్శన ఇవ్వడంతో వారు ఎంపికయ్యారు. ఆ తర్వాత కొంత కాలం ఇండియా-ఏ టీమ్ కు కోచ్ బాధ్యతలు నిర్వర్తించారు. టీమిండియా సీనియర్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు ఆయన ట్రైనింగ్ లోనే టీమిండియా పేసర్లు వికెట్లు పడగొడుతున్నారు.
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove ?
Hear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash ???? – By @RajalArora
Full Video ??https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023