Actress Soundarya
Actress Soundarya : 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సౌందర్య ఒక సంచలనం. పోస్టర్ పై ఆమె ఫోటో కనిపిస్తే చాలు మహిళా ప్రేక్షకులు ఆమె సినిమా చూసేందుకు థియేటర్లలో బారులు తీరేవారు. కుటంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తెలుగులో హీరోయిన్ సావిత్రి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పాపులారిటీ సాధించిన హీరోయిన్ సౌందర్య అంటే అతిశయోక్తి కాదు. ఫ్యామిలీ ఆడియెన్స్ సౌందర్య సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు.
హీరో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు, జగపతిబాబు లాంటి అప్పటి స్టార్ హీరోలు కూడా ఆమె డేట్ల కోసం వేచి చూసేవారు. దీనిని బట్టి చూస్తే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమాలో సౌందర్య ఉంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగేదని అప్పటి నిర్మాతలు చెబుతుంటారు.
30 ఏళ్ల క్రితం ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో సౌందర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమా విడుదల కాగా, సౌందర్యను హీరోయిన్ గా నిలబెట్టింది. మరోసారి రాజేంద్ర ప్రసాద్‌తోనే మాయలోడు సినిమా చేసి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు, మేడమ్, పెదరాయుడు ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ చైర్ లో కొన్నేళ్ల పాటు కూర్చుంది. సౌందర్యకు తిరుగులేని క్రేజ్ తో పాటు.. పాత్రలు కూడా ఆమె దరికే వచ్చేవి. ఏడాదికి దాదాపు ఏడెనెమిది సినిమాలతో బిజీగా మారింది. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది.
ఇక సౌందర్య ఏప్రిల్ 17, 2004లో హెలిక్యాఫ్టర్ ప్రమాదంలో చనిపోయింది. సౌందర్య మరణించేనాటికి ఆమె వయసు కేవలం 27ఏళ్లు . ఆమె మరణంతో సౌత్ ఇండస్ట్రీ షాక్ కు గురైంది.
సౌందర్య చనిపోయేనాటికి టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌లోనే టాప్ స్టార్ హీరోయిన్. ఇక ఆమె సంపాదన అప్పట్లోనే కోట్లల్లో ఉండేదని టాక్. తాను చనిపోయేనాటికి సౌందర్య అక్షరాల రూ.100 కోట్లకు పైగా ఆస్తులు పోగు చేసిందట. కాగా ఇప్పుడు ఆ ఆస్తిని ఆమె భర్తతో పాటు సౌందర్య తల్లి సమానంగా పంచుకున్నట్లు తెలిసింది. ఇందులో నిజమెంత అనేది మాత్రం బయటికి తెలియదు. ఇక టాలీవుడ్‌కు ఎందరు హీరోయిన్లు వచ్చినా కానీ.. సౌందర్య స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేపోయారు.