Brahmanandam : హాస్యానికి అర్థం బ్రహ్మానందం.ఆయన కనబడితే చాలు నవ్వుకుంటారు. ఆయనకున్నపేరు అలాంటిది. ఆయన కామెడీ ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యమే. బ్రహ్మానందం ఈ స్టేజీకి రావడానికి ముగ్గురు కారణం. ఆ త్రిమూర్తులెవరో తెలిస్తే గమ్మత్తుగానే ఉంటుంది. బ్రహ్మానందం ఈ స్థాయికి రావడానికి అవసరమైన త్రిమూర్తుల గురించి తెలుసుకుంటే వారు మామూలు వ్యక్తులు కాదు.
బ్రహ్మానందం సినిమాల్లోకి రావడానికి ముందు ఉపన్యసకుడిగా పనిచేసేవారు. మొట్టమొదటి సినిమా సత్యాగ్రహం. కానీ బ్రేక్ ఇచ్చిన సినిమా అహనా పెళ్లంట. దీనికి దర్శకులు జంధ్యాల. కోట శ్రీనివాస రావుకు అసిస్టెంట్ పాత్రకు సుత్తివేలును ఎంపిక చేశారు. కానీ అతడు బిజీగా ఉండటంతో మరో వ్యక్తి కోసం అన్వేషించారు. ఆ సమయంలో బ్రహ్మానందం పేరును సూచించాడు రామానాయుడు.
బ్రహ్మానందం ప్రయాణంలో చిరంజీవితో పరిచయం మలుపు తిప్పింది. చంటబ్బాయ్ షూటింగ్ సమయంలో జంధ్యాల బ్రహ్మానందంను చిరుకు పరిచయం చేశారు. మిమిక్రీ, కామెడీ టైమింగ్ కు చిరు ఆశ్చర్యపోయారు. మీరు మద్రాస్ రండి సినిమాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పడంతో వారి కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
బావగారు బాగున్నారా సినిమాలో చిరు, బ్రహ్మీ కాంబినేషన్ లో కామెడీ మంచి ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రహ్మానందం శవం లా నటించిన సన్నివేశాల్లో అలరించారు. అలాచిరు, బ్రహ్మి స్నేహం మంచి స్ఫూర్తిదాయకంగా మిగులుతుంది. బ్రహ్మీ ఎదుగుదలలో జంధ్యాల, రామానాయుడు, చిరంజీవి ముగ్గురు త్రిమూర్తులు తన కెరీర్ ఎదుగుదలకు సాయపడినట్లు పలు సందర్భాల్లో చెప్పడం విశేషం.