Bill Gates daughter : బిల్ గేట్స్ కూతురుని కొవిడ్ సమయంలో మోసం చేసింది ఎవరో తెలుసా?
Bill Gates daughter : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూతురు ఫొబో గేట్స్ కొవిడ్ సమయంలో తన ఫ్రెండ్స్ తనను ఎలా దూరం పెట్టారో వారి నుంచి ఎలా తాను సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ కూతురే పోబో గేట్స్. 2020 కొవిడ్ సమయంలో తన ఫ్రెండ్స్ తనతో ఫ్రెండ్ షిప్ ను ఎలా ముగించారో నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే డాక్యుమెంటరీ ‘వాట్ నెక్ట్స్’ ది ఫ్యూచర్ విత్ బిల్ గేట్స్ సిరీస్ ద్వారా ప్రపంచానికి తెలియజేయనుంది.
కొవిడ్ 19 సమయంలోొ ప్రపంచ వ్యాప్తంగా అంధకారం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ క్షణం ఎలాంటి విపత్తు వస్తుందో తెలియక సామాన్య ప్రజల నుంచి ఆగర్భ శ్రీమంతుల దాకా వణికిపోయారు. ఎప్పుడు బతికి ఉంటామో ఎలా చనిపోతామో తెలియక ఆందోళన చెందారు. ఈ సమయంలో వ్యాక్సిన్ వివాదాలు, ఫండ్స్ రైజింగ్ గురించి బిల్ గేట్స్ పై కొంత మంది ఆరోపణలు చేశారు.
ఈ విషయంలో బిల్ గేట్స్ కూతురు ఫోబో గేట్స్ తో తన ఫ్రెండ్స్ కూడా నమ్మకుండా మధ్యలోనే విడిచి పెట్టారని సమాచారం. దీనికి సంబంధించి బిల్ గేట్స్ కూతురు ఫ్రెండ్స్ గొంతు కోస్తారని అనుకోలేదు. అప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యాం. ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తోందని తన సన్నిహితుల వద్ద అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే అంశాన్ని నెట్ ఫ్లిక్స్ లో వాట్ నెక్ట్స్ సిరీస్ ప్యూచర్ విత్ బిల్ గేట్స్ ద్వారా ప్రపంచానికి కొవిడ్ 19 సమయంలో జరిగిన విపత్తు గురించి తెలియజేయనుంది. అయితే వ్యాక్సిన్ తయారీ, నిధుల సమీకరణ, ఇతర అంశాలపై బిల్ గేట్స్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో బిల్ గేట్స్ ను టార్గెట్ చేసుకుని ఫుంఖాను ఫుంఖాలుగా వార్తలు రావడంలో మైక్రో సాఫ్ట్ అధినేతతో పాటు అతడి కూతురు పోబో గేట్స్ ఫ్రెండ్స్ ను ఆమె ను దగ్గరికీ రానీయలేదు.