Ayodhya Case : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఎన్నో ఏళ్ల కల. దీని కోసం ప్రతి భారతీయుడు తన మనసులోనే సంతోషం వ్యక్తంచేశాడు. దేశ ప్రజల ఆశలను గౌరవించి ప్రధాని మోదీ రామాలయ నిర్మాణ కలను సాకారం చేశారు. దశాబ్దాల కల నెరవేరిన వేళ ప్రతి ఒక్కరిలో ఉద్వేగం పెరిగింది. రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయడంతో దేశం మొత్తం గర్వించింది. రాముడి ప్రతిష్ట వేడుకను ఆసక్తిగా తిలకించింది.
రాముడి దేవాలయం సాకారం కావడానికి చాలా పోరాటాలు జరిగాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ఇప్పటి వరకు న్యాయపోరాటాలతోనే అయోధ్య రామాలయం కల తీరింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో పాలన సాగిస్తోంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. బీజేపీ నేతలు బాబ్రీ మసీదు కూల్చివేతతో మన వారిలో ఆశలు రేకెత్తాయి.
అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 2019 ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకు నిరంతరంగా 40 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. ఈ కేసులో న్యాయవాది కేశవ పరాశరన్ రాముడి ఆలయం కోసం తన వాదనలు వినిపించారు. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ఓపిగ్గా నిలబడి రాముడి కోసం శక్తిని కూడగట్టుకుని మరీ వాదించడం విశేషం.
అలా దేవుడి కోసం అయోధ్య కేసు వాదించి సఫలం అయ్యారు. అలాగే 1973లో కేశవానంద భారతి కేసులో కూడా సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలా హిందుత్వ కేసుల్లో ఆయన తన శక్తియుక్తులను ప్రదర్శించి విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణిస్తుంటారు. మొత్తానికి అయోధ్య మన సొంతం కావడంతో అందరిలో ఆనందాలు వెల్లివిరిశాయి.