Flowers And Leaves Lord Shiva Likes : పరమశివుడు అల్పసంతోషి. మనం పూజించడం వల్ల సంతోషిస్తాడు. మనకు వరాలు కురిపిస్తాడు. మనం కోరిన కోరికలు తీరుస్తాడు. మనకు ఏం కావాలన్నా ఇస్తాడు. కానీ అది మనం శవయ్యను వేడుకునే తీరులో ఉంటుంది. శివుడికి ఇష్టమైన పూలు, పత్రాలతో పూజిస్తే కచ్చితంగా కరుణిస్తాడు. మనం అడిగిన వరాలు ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని వశం చేసుకోవడం కష్టమే అయినా ఆయనను సంతోష పరచడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతుంటారు.
మహా శివుడికి బిల్వ పత్రమన్నా, పూలన్నా చాలా ఇష్టం. వాటితో పూజ చేస్తే పరమశివుడు వెంటనే కరుణిస్తాడు. మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడని విశ్వసిస్తుంటారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం కావడంతో శివకేశవులకు ఎంతో ప్రీతి. అందుకే ఈ నెలలో శివుడిని వశం చేసుకోవడం సులభం. బిల్వ ఆకులు, పూలు దొరికితే వాటితో పూజ చేయడం మంచిది.
బిల్వ పువ్వును సైంటిఫిక్ గా ఏగిల్ మార్కెలోస్ అని పిలుస్తారు. వీటితో శివుడికి పూజ చేయడం ఉత్తమం. ఈ పువ్వులతో పూజ చేయడం వల్ల జీవితాంతం చేసిన పుణ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఈ పువ్వులతో పూజ చేసిన వారికి చనిపోయిన తరువాత కైలాసానికి వెళతారని అంటుంటారు. ఇలా పరమశివుడికి అత్యంత ఇష్టమైన మారేడు ఆకులు, పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది.
ఇవి దొరకాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే సాధ్యమవుతుంది. అది కూడా అడవులు ఉంటే ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. దీంతో వీటిని సేకరించడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కొంచెం సమయం కేటాయించుకుంటే సులభంగానే సేకరించుకోవచ్చు. పరమశివుడికి ప్రేమమయమైన వీటిని సేకరించి ఈ మాసంలో పూజ చేయడం వల్ల మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.