Most Powerful Militaries : దేశం ఎంత శక్తివంతమైంది అనేది ఆ దేశ సైన్యంను బట్టి ఉంటుంది. విస్తీర్ణంలో చిన్న దేశాలైనా పెద్ద దేశాలను ఎదురించేందుకు ముందుకు రావాలంటే ఆ దేశాల సైనిక శక్తి ఎలాంటిదో తెలియాలి. దేశంలో రైతులు ఎంత ఇంపార్టెంటో.. బార్డర్ లో సైనికులు అంతే ఇంపార్టెంట్. కేవలం యుద్ధాలకే కాదు. సేవా కార్యక్రమాల్లో కూడా ఆర్మీ ముందుంటుది. వరదలు, భూకంపాలు లాంటివి వచ్చిన సమయంలో ఆర్మీ సేవా కార్యక్రమాలు చేపడుతుంది. కొన్ని దేశాలు కేవలం తమ దేశంలో కోసం మాత్రమే ఆర్మీని ఉపయోగించుకుంటే, కొన్ని దేశాలు మాత్రం మిత్ర దేశం ఆపదలో ఉంటే తమ సైనాన్ని పంపిస్తాయి. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన మిలటరీ ఉన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలవగా.. భూటాన్ చిట్ట చివరి దేశంగా మిగిలింది.
వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ ఉన్న దేశాల లిస్ట్ లో అగ్ర భాగంలో అమెరికా ఉండగా.. రష్యా, చైనాలు సెకెండ్, థర్డ్ ప్లేస్ లను ఆక్రమించాయి. ఆ తర్వాతి 4వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని పర్యవేక్షించే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్.. 2024కు సంబందించి ప్రపంచ దేశాల సైనిక శక్తికి ర్యాంకింగ్స్‌ను కేటాయించింది. మొత్తం 145 దేశాలకు సంబంధించి ర్యాంకులను వెల్లడించింది.
సైనికుల సంఖ్య, వారు ఉపయోగించే పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులు వంటి, తదితర 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పవర్ ఇండెక్స్ స్కోర్‌ని గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్ తయారు చేసింది. ఈ జాబితాలో ఇజ్రాయిల్ 17 స్థానంలో ఉంది. డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూస్తే అమెరికానే టాప్‌లో ఉండగా.. చైనా సెకండ్, రష్యా థర్డ్ స్థానంలో, భారత్ యధావిధిగానే 4వ స్థానంలో నిలిచాయి. డిఫెన్స్ కు బడ్జెట్ కేటాయింపులో పాకిస్తాన్ 47వ స్థానం, బంగ్లాదేశ్ 43వ స్థానంలో నిలిచాయి.
భారత్ తర్వాత దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డం (యూకే), జపాన్, తుర్కిమేనియా, పాకిస్థాన్, ఇటలీ నిలిచాయి. ఈ జాబితాలో చిట్ట చివరిగా 145 వ స్థానంలో భూటాన్ ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా భూటాన్ ఆర్మీ నిలిచింది. భూటాన్ కంటే ముందు మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలిజ్, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ దేశాలు ఉన్నాయి.