Mahesh Babu daughter Sitara : మహేశ్ బాబు కూతురు సితార అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. చిన్నపప్పటి నుంచే ఎన్నో మంచి పనులు చేస్తూ ఇతరులకు సాయం చేస్తూ అందరితో కలిసిపోతుంది. సితార కు స్పెషల్ గా యూట్యూబ్ చానల్ , ఇన్ స్టా గ్రాం కూడా ఉంది. ఇందులో తాను ఏం చేస్తుందో అప్పుడప్పుడూ చెబుతూనే ఉంటుంది. కాగా సితార ముఖేశ్ అంబానీ కొడుకు ఆనంత్ అంబానీ పెళ్లిలో తళుకుమని మెరిసింది.
మహేశ్ బాబు, నమ్రత, సితార కలిసి అనంత్ అంబానీ పెళ్లి కి వెళ్లారు. అక్కడ సెలబ్రెటీలు ఫొటోలు దిగుతున్న సమయంలో అందరూ సితార వైపే చూశారు. చిన్న వయసులోనే చాలా ఎత్తుగా పెరిగిపోయింది సితార. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సితారను కొన్ని ప్రశ్నలు అడగ్గా వాటికి ఆమె నింపాదిగా సమాధానం చెప్పింది. సితార ఏ క్లాస్ చదువుతున్నావ్ అని రిపోర్టర్ ప్రశ్నించారు. కాగా ఈ మధ్యే ఆరో తరగతి పూర్తి చేశాను. ఏడో తరగతిలో చేరాలి అని బదులిచ్చింది.
సితార అనాథశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు సేవ చేస్తూ ఉంటుంది. సితార ఎప్పటికప్పుడు తాను చేసే పనులను మహేశ్ బాబు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దాదాపు మహేశ్ బాబుకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో.. సితారకు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే సితార ఇంతలా ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో మరెంతో ఎత్తుకు ఎదుగుతుందని అందరూ అనుకుంటున్నారు.
ఈ మధ్యనే సితార బర్త్ డే చేసుకోగా సెలబ్రెటీలు, ప్రముఖులు అందరూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే సితార హైట్ చూసి చాలా మంది ఎంతో పెద్ద చదువులు చదువుతుంది అని అనుకుంటారు. కానీ ఆమె ప్రస్తుతం కేవలం ఆరో తరగతి చదువుతుందని తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. సితార ఏజ్ ప్రస్తుతం కేవలం 12 ఏళ్లు మాత్రమే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.