Walking and Running : ఈరోజుల్లో ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దైనందిన జీవితంలో మన ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి. దీంతో అరవైలో రావాల్సిన రోగాలు ఇరవైలోనే వస్తున్నాయి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితకాలం మందులు మింగుతూ కాలం గడపడానికే ఇష్టపడుతున్నారు. కానీ రోగాలు రాకుండా చేసుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదు.
మధుమేహం, రక్తపోటు ఉన్న వారు తప్పనిసరిగా వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం సమయంలో కచ్చితంగా నడక మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే వాకింగ్ చేస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు రన్నింగ్ చేస్తుంటారు. రన్నింగ్ చేయడం వల్ల చెమట బాగా పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రన్నింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
డబ్బులున్న వారైతే ట్రెడ్మిల్ తెచ్చుకుని దాని మీద రన్నింగ్ చేస్తుంటారు. ఆరుబయట రన్నింగ్ చేస్తేనే మంచి లాభాలుంటాయి. ఇంటిలో రన్నింగ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని తెలుసుకోవాలి. ఏదైనా మనం బయట చేస్తేనే బాగుంటుంది. వాకింగ్, రన్నింగ్ లు పార్కుల్లాంటి ప్రదేశాల్లో చేయడం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. చెట్ల గాలి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలుసుకోవాలి.
మన ఆరోగ్య రీత్యా మనం వాకింగ్ చేసినా, రన్నింగ్ అయినా బయట చేయడమే ఉత్తమం. దీంతో మంచి ఫలితాలు వస్తాయని వైద్యులే చెబుతున్నారు. అందుకే వాకింగ్, రన్నింగ్ బయట చేయడంతో మనకు ప్రయోజనాలు ఎక్కువగా దక్కుతాయి. ఈ నేపథ్యంలో వాకింగ్, రన్నింగ్ బయట చేయడానికే ఇష్టపడితే ఎంతో మేలు కలుగుతుందని గుర్తుంచుకోవాలి.